బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః । పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకోనచత్వారింశస్సర్గః (౨౦వ శ్లోకము)

రావణునికి సహాయము చేయనని చేపుతూ మారీచుడీ ధర్మవాక్యములు పలికెను: “సదాచారసంపన్నులైన సత్పురుషులు సైతము దుష్టసాంగత్యముచేయుటచే సమూలముగా నశించిన గాధలు లోకప్రసిద్ధములే కదా!”.

కాబట్టి మనము దుష్టులకు వీలయినంత దూరముగా మెలగవలెనని తాత్పర్యము.