నహ్యస్మాభిః ప్రతిగ్రాహ్యం సఖే! దేయం తు సర్వదా । ఇతి తేన వయం రాజన్ అనునీతా మహాత్మనా ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే సప్తాతీతిశమస్సర్గః (౧౬వ శ్లోకము) గుహుడు భరతునితో శ్రీరాముని సత్యపరాక్రమము, ధర్మనిరతిని, శ్లాఘిస్తూ అతడు భక్షభోజ్యాలు సమర్పించినప్పుడు, వాటిని అతి సున్నితముతా నిరాకరిస్తూ శ్రీరాముడు పలికిన ధర్మోక్తులను ఈ శ్లోకము ద్వారా చెప్పెను: “ మహాత్ముడైన శ్రీరాముడు నన్ను ఈ క్రింది అనునయ వాక్యాలతో బుజ్జగించెను: ’ఓ ప్రియసఖా! మావంటి క్షత్రియులు ఎప్పుడూ (ప్రజలకు) ఇవ్వవలెనే కానీ, ఎన్నడూ (ప్రజలనుండి) పుచ్చుకోకూడదు’.” మనము నేర్వవలసిన నీతులు: క్షత్రియులు ఎప్పుడూ అర్హులైన అర్థులకు వారి కామ్యములను…

భర్తా చైవ సఖా చైవ రామో దాశరథిర్మమ । తస్యార్థకామాః సన్నద్ధా గఙ్గానూపే ప్రతిష్ఠిత ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతురశీతితమస్సర్గః (౬వ శ్లోకము) మిత్రుడైన శ్రీరామునిపైనున్న సహజమైన ప్రీతివల్ల గూహుడు సైనలతో వచ్చిన భరతుని శంకిచెను. ఆతడు శ్రీరామునికి కీడు చేయునేమో అని భయపడి ముందుజాగ్రత్తగా అప్రమత్తులమై ఉండాలని తన సేనలను హెచ్చరిస్తూ ఈ శ్లోకము చెప్పెను: “శ్రీరామచంద్రుడు నాకు ప్రభువు, అంతేకాదు, పరమమిత్రుడు. ఆయన సౌఖ్యముకోసము మనము అప్రమత్తులమై గంగాతీరము వద్ద పొంచి ఉందాము”. ఈ శ్లోకము ద్వారా మనకు స్నేహము యొక్క గొప్పతనము, స్నేహితుడు యొక్క ఔన్నత్యము తెలుస్తున్నది. స్నేహితుడు, తన…