స్నేహాచ్చ బహుమానాచ్చ స్మారయే త్వాం న శిక్షయే ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౨౪వ శ్లోకము) శ్రీరాముడు పరస్పర విరుద్ధములైన క్షాత్ర, తాపస ధర్మములు సూక్ష్మబుద్ధితో తూచా తప్పక పాటించాలన్న కాంక్షతో ఒక నీతికథను వినిపించినది సీతాదేవి. అది వినిపించిన తరువాత వినయముతో ఈ శ్లోకము పలికినది: “మీ మీద చనువుతో ఈ కథను మీకు జ్ఞప్తికి తెచ్చితినే కాని, ఇది హితబోధ ఏమాత్రమూ కాదు”. మీదుమిక్కిలి, మీకు ధర్మమును తెల్పగల సమర్థులెవ్వరు? ఒక గురువుతో (పతితో) శిష్యుడు (భార్య) ఎలామాట్లాడాలో ఈ శ్లోకముద్వారా సీతాదేవి మనకు…

నవీకృతం తు తత్ సర్వం వాక్యైస్తే ధర్మచారిణి । పతిశుశ్రూషణాన్నార్యాః తపో నాన్యద్విధీయతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టదశోత్తరశతతమస్సర్గః (౯వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించిన అనసూయాదేవితో సీత ఇట్లు అద్భుత సమాధానమిచ్చెను: “మా అత్తగారు, అమ్మ, నాకు చేసిన ఉపదేశములు మీరు జ్ఞప్తికి తెచ్చినారు. పతి శుశ్రూషయే స్త్రీకి గొప్ప తపస్సు. దీనిని మించిన తపస్సు స్త్రీకి లేదు”. ఈ శ్లోకము ద్వారా స్త్రీధర్మాలే కాకుండా, మధురము మాటలెలా మాట్లాడాలో సీతాదేవి మనకు నేర్పుతున్నది. లోకములో విషయములు పునశ్చరించినప్పుడు జనులకి ఈ విషము తెలుసుననే హేయభావముండును.…

తదేవమేనం త్వమనువ్రతా సతీ పతివ్రతానాం సమయానువర్తినీ । భవ స్వభర్తుః సహధర్మచారిణీ యశశ్చ ధర్మం చ తతస్సమాప్స్యసి ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౭వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి: నీవు పతిసేవనమందే నిమగ్నమైయ్యుండుము. పతివ్రతాధర్మము పాటించుము. నీ భర్తకు సహధర్మచారిణివైయ్యుండుము. ఇదే నీకు కీర్తిని, ఉత్తమ ధర్మఫలమును ఇచ్చును.

దుశ్శీలః కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః । స్త్రీణామార్యస్వభావానాం పరమం దైవతం పతిః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౨వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి: “పతి చెడుస్వభావముగలవాడైనను, స్వేచ్ఛాచారియైనను, ధనహీనుడైనను, ఉత్తమ స్త్రీకి అతడే దైవము”.

నగరస్థో వనస్థో వా పాపో వా యది వాశుభః । యాసాం స్త్రీణాం ప్రియో భర్తా తాసాం లోకా మహోదయాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౧వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి: “తన భర్త నగరమునందున్నను, వనములపాలైనను, సన్మార్గుడై నను, దుర్మార్గుడైనను, అతనిని ప్రమతో అనుగమించుట వలనే స్త్రీకి సద్గతులు ప్రాప్తిస్తాయి”.

నైషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా । ఉభయోర్లోకయోర్వీర! పత్యా యా సమ్ప్రసాద్యతే ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్విషష్టితమస్సర్గః (౧౩) మహాసాధ్వియైన కౌసల్యాదేవి ఇట్లనెను “ప్రశంసార్హుడు, ప్రజ్ఞాశాలి ఐన పతిచే బ్రతిమలాడించుకొను సతికి ఇహపరములు దక్కవు”.

భర్తా తు ఖలు నారీణాం గుణవాన్ నిర్గుణోఽపి వా । ధర్మం విమృశమానానాం ప్రత్యక్షం దేవి! దైవతమ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్విషష్టితమస్సర్గః (౮) “నిర్గుణుడైనా, సగుణుడైనా, సతికి పతియే ప్రత్యక్ష దైవము”. ఇది స్త్రీజాతికి భగవంతుడిచ్చిన గొప్ప వరము. అట్లే పురుషజాతికిది కత్తిమీదసాము. ఏలన భగవంతుని వలె అపారమైన కరుణయు, అనుగ్రహము పతిస్థానమున యుండి చూపుట బహు కష్టము కదా.