అనాగతవిధానం తు కర్తవ్యం శుభమిచ్ఛతా । ఆపదం శఙ్కమానేన పురుషేణ విపశ్చితా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే చతుర్వింశ్శస్సర్గః (౧౧వ శ్లోకము) దుశ్శకునములను గమనించిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను: “శుభములను కోరుకొనెడి దూరదర్శి తనకెదురగు ఆపదలను ఊహించి, రాబోవు అనర్థములకు తగిన ప్రతిక్రియ చేయవలెను”.  అప్పుడు శ్రీరాముడు రాబోయే ఖరదూషణ యుద్ధమును ఊహించి, తగిన జాగ్రత్తలు, సన్నాహములు చేసెను. మనముకూడా శ్రీరామునివలె ఎల్లప్పుడు అప్రమత్తులమై ఉండవలెను, అని నీతి.

రాఘవాయ చ సన్న్యాసం దత్త్వేమే వరపాదుకే । రాజ్యం చేదమయోధ్యాం చ ధూతపాపో భవామిచ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౨౦వశ్లోకము) “సర్వరక్షంకరములైన రామపాదుకల ప్రభావముచే ఈ ౧౪ ఏండ్లు రాజ్యపాలనము చేసి, శ్రీరాముడు తిరిగి వచ్చిన పిదప ఆయన నా వద్ద న్యాసంగా ఉంచిన రాజ్యమును, అయోధ్యను (మరియు ఈ పాదుకలను) ఆయనకు తిరిగి ఇస్తాను. అప్పుడు నా పాపములన్ని (రామానుగ్రహమువలన) నిశ్శేషముగా దగ్ధమగును”. ఈ శ్లోకము భగవద్గీతలో స్వామి చెప్పిన చరమశ్లోకమైన “సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ । అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥” కి సరిగ్గా సరిపోతుంది. కాబట్టి…

ఉపధిర్న మయా కార్యో వనవాసే జుగుప్సితః ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౨౯వ శ్లోకము) శ్రీరాముని మీది అమితమైన ప్రేమావేశముతో భరతుడు తానే అన్నగారికి బదులుగా వనవాసవ్రతము చేసెదనని అందరిముందరా ఘోషించెను. అప్పుడు శ్రీరాముడీ అమృతవాక్కులను పలికెను: “నాకు మారుగా భరతుడు వనవాసము చేయుటకు నేనిష్టపడను. ఏలన సమర్థుడైనవాడు ప్రతినిధితో పని చేయించుట అత్యంత జుగుప్సాకరము కదా”! కాబట్టి మన కర్తవ్యమును మనమే నెరవేర్చుకో వలెను. అవతలవానికి దానిని అప్పచెప్పరాదు. ఇట్టి సోమరిని రాముడు మెచ్చడని ఈ శ్లోకము ద్వారా తెలియుచున్నది.

యథాహి చోరః స తథాహి బుద్ధః తథాగతం నాస్తికమత్ర విద్ధి । తస్మాద్ధి యఃశఙ్క్యతమః ప్రజానాం న నాస్తికేనాభిముఖో బుధః స్యాత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౩౪వ శ్లోకము) “ఎట్లాగైతే నేర్పరితనమున్నా ఒక చోరుడు దండనార్హుడో, అట్లే తెలివైనవాడైనాసరే వేదధర్మమునకు విరోధియైన నాస్తికుడు కూడా దండనార్హుడే. ఇట్టివానిని సమాజము శంకించవలసినదే. సత్పురుషులైనవారు నాస్తికులతో వాదించరాదు, ఎట్టి సంబంధమునూ పెట్టుకొనరాదు”, అని శ్రీరాముడు జాబాలిమహర్షితో హితవు పల్కెను. కాబట్టి మనము నాస్తికులకు వీలైనంతే దూరముగానుండుటే శ్రేయస్కరము.

అమృష్యమాణః పునరుగ్రతేజా నిశమ్య తం నాస్తికవాక్యహేతుమ్ । అథాబ్రవీత్ తం నృపతేస్తనూజో విగర్హమాణో వచనాని తస్య ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః  (౩౦వ శ్లోకము) శ్రీరాముని ఎలాగైనాసరే తిరిగి అయోధ్యకు రప్పించాలని జాబాలి మహర్షి నాస్తిక బోధలు చేసిరి. ఈ దుర్బోధలు వినిన శ్రీరాముడు క్రుద్ధుడయ్యెను: “మహాతేజస్వియైన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమును విని, దానిని సహించనివాడై, ఆ వచనములను శాస్త్రవచనముల ద్వారా ఖండించుచు బదులిచ్చెను”. నాస్తికవాదము, హేతువాదము ఎన్నడు చేయరాదని శ్రీరాముని సందేశము. కాబట్టి మనమెల్లప్పుడు సర్వద్రష్టలైన మహర్షులందించిన శాస్త్రములనే ఆధారముగా చేసుకుని, తదనుసారము జీవించవలెను.

కాయేన కురుతే పాపం మనసా సమ్ప్రధార్య చ । అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మపాతకమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౨౧వ శ్లోకము) జాబాలి మహర్షికి సమాధానమిస్తున్న సందర్భములో శ్రీరాముడీ మధురవాక్సుధను కురిపించెను: “మనుజుడు పాపకృత్యము చేసినప్పుడు, ఆ పాపకర్మ యొక్క దోషముతో పాటు మరో రెండు దోషములంటును. అవియేమనగా, పాపకృత్యమునకై సంకల్పించిన, ఆలోచించిన దోషము, వాగ్రూపములో దానికై చేసిన అసత్యదషము. ఇలా ఒక్కటే ఐననూ పాపకార్యమునకు దుష్ఫలము మూడింతలగును”. కాబట్టి మనము పాపకార్యము యొక్క తలంపేసేయరాదని శ్రీరాముని సందేశము. ఎంత ప్రయత్నించిననూ పాపాలోచన పరబాటుగా వస్తే దాన్ని అక్కడే ఆపివేసి, వాక్, కార్య…

కామవృత్తస్త్వయం లోకః కృత్స్నః సముపవర్తతే । యద్వృత్తాః సన్తి రాజానః తద్వృత్తాః సన్తి హి ప్రజాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౯వ శ్లోకము) అయోధ్యకు తిరిగరమ్మని బోధించిన జాబాలిమహర్షిని ఉద్దేశించి శ్రీరాముడిట్లనెను: “నీవు చెప్పిన రీతిగా నేను ధర్మమును తప్పి, విచ్చలివిడిగా ప్రవర్తించినచో నన్ను చూచి లోకమంతా అట్లే అధార్మికముగా ప్రవర్తించును. ఏలన ఉన్నత పదవులలోనున్న వారిని ఇతరులు అనుసరింతురుకాదా!”. భగవద్గీతలో కృష్ణస్వామిచెప్పిన “యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః| స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||” శ్లోకమునే ఇక్కడ రామస్వామి చెప్పుచున్నారు. అందరూ ధర్మామార్గముననే నడువవలెను. మీదుమిక్కిలి ఉన్నత పదవులలోనున్నవారు మరింత జాగరూకులై ధర్మము…