దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ సత్యం బ్రూయాన్న చానృతమ్ । ఏతద్బ్రాహ్మణ! రామస్య ధ్రువం వ్రతమనుత్తమమ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే సప్తచత్వారింశస్సర్గః (౧౭వ శ్లోకము) శ్రీరాముని గుణాలలు వర్ణిస్తూ సీతాదేవి “ఒకరికి ఇచ్చినది తిరిగి స్వీకరించకుండుట, నిజాలే తప్ప అబద్ధాలు పల్కకుండుట, ఇవి రాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పని నియమాలు” అని ఈ శ్లోకము ద్వారా చెప్పినది.

స్వదారనిరతస్త్వం చ నిత్యమేవ నృపాత్మజ । ధర్మిష్ఠః సత్యసన్ధశ్చ పితుర్నిర్దేశకారకః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౬వ శ్లోకము) యుక్తాయుక్తములు బాగా తెలిసిన సీతాదేవి తన పతితో ప్రేమగా ఇలా పలికినది: “నీవు ఎల్లప్పుడు నీ ధర్మపత్నినైన నన్నే కోరుకుందువు (పరస్త్రీవ్యామోహము నీకు లేదు), నీవు నిత్యసత్యవాదివి. నీవు ధర్మానికి నిలయము, తండ్రి యొక్క వచనమును సైతము నిలబెట్టిన ధార్మికుడివి”. శ్రీరామునిలో మనము నేర్వవలిసిన శుభలక్షణములు సీతాదావి స్వయముగా మనకీశ్లోకముద్వారా బోధించుచున్నది.

తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీమ్ । అభిగచ్ఛతు వైదేహీ వృద్ధామక్రోధనాం సదా । అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిమాగతా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము) అత్రిమహర్షి అనసూయాదేవి యోక్క ఔన్నత్యము, తపశ్శక్తి, గూర్చి సీతారాములకు వివరిస్తూ ఈ శ్లోకము చెప్పెను: “(ఒకసారి ముల్లోకములలో పది సంవత్సరముల క్షామమేర్పడినది. అప్పడు అనసూయాదేవి తన తపశ్శక్తితో ఫలమూలములు, గంగను సృష్టించి కాపాడెను. అందుకని) ఈమె ముల్లోకములలోని సర్వభూతములకు పూజ్యురాలు. ఈమె క్రోధమును జయించిన పరమ శాంతమూర్తి. తన సత్కర్మలద్వారా ‘అనసూయ’ (అంటే అసూయ లేనిది) అని పేరు సంపాదించుకొన్నది.” భరతజాతిలో స్త్రీ యొక్క ఔన్నత్యమును చాటే అనసూయాదేవి వంటి సాధ్వీమణులు…

తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్త్వాత్మని శఙ్కితః । కృతాఞ్జలిరువాచేదమ్ ఋషిం కులపతిం తతః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షోడశోత్తరశతతమస్సర్గః (౪వ శ్లోకము) ఒకనాడు శ్రీరాముడు చిత్రకూటము వద్ద నివసించు మునులలో ఆందోళనను వారి ముఖకవళికల ద్వారా గమనించెను. సాధుల కష్టములు చూడలేని ఆతడు, ఆందోళనకు కారమేమని ఆలోచించి, ప్రప్రథమముగా తనే తెలియ కారణము కాదు కదా? అని ఆత్మశంకచేసుకొనెనని ఈ శ్లోకార్థము. ఆత్మవిచారణ బహు ఉత్తమగుణము. ఇది మనము శ్రీరాముని వద్ద నేర్వవలెను. అతడి పరధార్మికుడైయ్యుండి కూడా, రాజైకూడా, మెట్టమొదట తనను తానే శంకించుకొనెను!

న దోషం త్వయి పశ్యామి సూక్ష్మమప్యరిసూదన । న చాపి జననీ బాల్యాత్ త్వం విగర్హితుమర్హసి ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతురుత్తరశతతమస్సర్గః (౧౭వ శ్లోకము)   శ్రీరామునికీ కష్టాలు తన తల్లి అయిన కైకేయి వల్లనే వచ్చెనని చెప్పి, దుఃఖిస్తున్న భరతుని ఉద్దేశించి శ్రీరాముడిట్లనెను. “ఓ (అరిషడ్వర్గమనే) శత్రువులను జయించినవాడా! భరతా! (నేను కాననలకు వచ్చుటలో) నీ దోషము నాకు కొంచమైనా కనబడుటలేదు. కానీ నీవు తల్లిని ఎన్నడూ అజ్ఞానవశమునసైతము నిందింపరాదు సుమా!”.   ఇతరులను, ముఖ్యముగా గురుస్థానములోనున్న తల్లి, తండ్రి, ఆచార్యుడు, వీరినెన్నడూ నిందించుచూ మాట్లాడరాదని శ్రీరాముని సందేశము. అంతేకాక శ్రీరాముని శీలసంపద కూడా…

జఘన్యమపి తే పుత్త్రః కృతవాన్ నతు గర్హితః । భ్రాతుర్యదర్థసహితం సర్వం తద్విహితం గుణైః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్య్రుత్తరశతతమస్సర్గః (౬వ శ్లోకము)  లక్ష్మణుని భ్రాతృసేవను శ్లాఘిస్తూ సుమిత్రాదేవితో కౌసల్యామాత చెప్పిన అమృతవాక్కులివి: “సద్గుణశీలుడైన అన్నగారి యడల చేసిన కారణముగా లక్ష్మణుడు చేసే సేవలు చిన్నవైనప్పటికీ (సాధారణ దృష్టిలో హేయములు, నిమ్నములైనప్పటికీ) అవి నిమ్నములు కావు. (అట్లే దుష్టులపట్ల ఎంత అసాధారణ ప్రజ్ఞాపూర్ణములైన పనులు చేసినా అవి నిమ్నములే)”. “Dignity of Labour” అన్న పదానికి సరైన నిర్వచమిచ్చినదీ శ్లోకములో కౌసల్యామాత. ఒక పనియొక్క గొప్పతనము, లేదా నిమ్నత్వము ఆ పనిని బట్ట నిర్ణయింపరాదనీ,…

తాన్ నరాన్ బాష్పపూర్ణాక్షాన్ సమీక్ష్యాథ సుదుఃఖితాన్ । పర్యష్వజత ధర్మజ్ఞః పితృవన్మాతృవచ్చ సః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వ్యుత్తరశతతమస్సర్గః (౪౭వ శ్లోకము)  “బాష్పవ్యాకులలోచనులై తన వద్దకు చేరిన బంధుమిత్రులను కన్న తల్లిదండ్రులను మరపించు విధముగా కౌగిలించుకొనెను ధర్మజ్ఞుడైన శ్రీరాముడు”. బంధుమిత్రాదులయందు ఎంత ప్రేమాతిశయములు కలిగి ఉండాలో శ్రీరాముడు మనకు నేర్పుతున్నాడు.

బలం సర్వమవస్థాప్య జగామ సహ మన్త్రిభిః ॥ పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్తశస్త్ర పరిచ్ఛదః ।

శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే నవతితమస్సర్గః (౧-౨ శ్లోకములు) ధర్మజ్ఞుడైన భరతుడు, భారద్వాజాశ్రమానికి క్రోసెడు దూరములోనే సేనలని నిలిపివేసి, శస్త్రాస్త్రాలను, ఆభరణాదులను, విడిచి, ముఖ్యమైన మంత్రులతో కలిసి కాలినడకన  మునిసందర్శనముకై వెళ్ళెనని ఈ శ్లోకపుభావము. పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, వెళ్ళేటప్పుడు మన అహంకారాదులను, ఆడంబరాలను, పూర్తిగావిడిచి పెట్టి, దైన్యభావనుతో నుండాలని భరతుని సందేశము. అట్ట్లు చేయక ఆ క్షేత్రాలలో కూడా మన సౌకర్యముకై ప్రాకులాడుట అధర్మమని వాల్మీకిమహర్షి తీర్పు.

నహ్యస్మాభిః ప్రతిగ్రాహ్యం సఖే! దేయం తు సర్వదా । ఇతి తేన వయం రాజన్ అనునీతా మహాత్మనా ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే సప్తాతీతిశమస్సర్గః (౧౬వ శ్లోకము) గుహుడు భరతునితో శ్రీరాముని సత్యపరాక్రమము, ధర్మనిరతిని, శ్లాఘిస్తూ అతడు భక్షభోజ్యాలు సమర్పించినప్పుడు, వాటిని అతి సున్నితముతా నిరాకరిస్తూ శ్రీరాముడు పలికిన ధర్మోక్తులను ఈ శ్లోకము ద్వారా చెప్పెను: “ మహాత్ముడైన శ్రీరాముడు నన్ను ఈ క్రింది అనునయ వాక్యాలతో బుజ్జగించెను: ’ఓ ప్రియసఖా! మావంటి క్షత్రియులు ఎప్పుడూ (ప్రజలకు) ఇవ్వవలెనే కానీ, ఎన్నడూ (ప్రజలనుండి) పుచ్చుకోకూడదు’.” మనము నేర్వవలసిన నీతులు: క్షత్రియులు ఎప్పుడూ అర్హులైన అర్థులకు వారి కామ్యములను…

చరితబ్రహ్మచర్యస్య విద్యాస్నాతస్య ధీమతః । ధర్మే ప్రయతమానస్య కో రాజ్యం మద్విధో హరేత్ ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ద్వ్యశీతితమస్సర్గః (౧౧వ శ్లోకము)  దశరథుడు భరతునికి రాజ్యాధికారమును అప్పగించినందున, పట్టాభిషిక్తుడై రాజ్యపాలనము చేయమని పురోహితుడైన వసిష్ఠుడు భరతుని ఆదేశించెను. అప్పుడు భరతుడీ మధుర వాక్కులు పల్కెను: “ఓ గురూత్తమా! అస్ఖలిత బ్రహ్మచారి, సకల విద్యాపారంగతుడు, మేధావి, నిరంతరము ధర్మము యందే మనస్సు కల్గినవాడు అయిన శ్రీరామచంద్రుడే ఈ రాజ్యమునకర్హుడు. అట్టి అర్హతలు నాకెక్కడివి”? మనమునేర్వవలసిన నీతులు: భరతుని వలె మనమూ, అసూయకు లోనుకాక, శ్రేష్ఠుల యొక్క ఆధిక్యతను గుర్తించి, వారిని అనుసరించగలగాలి. ఎంత…