రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ । పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు ॥
— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకసప్తతితమస్సర్గః (౨౨-౨౩) రామలక్ష్మణుల యొక్క శౌర్యప్రతాపాలను స్వయముగా దర్శించి, ఇక్ష్వాకువంశము యొక్క కీర్తిచంద్రికలను యెరిగిన జనకుడు తన కుమార్తెలైన సీతా ఊర్మిళలకు రామలక్ష్మణులే తగినవారని నిర్ణయించి, దశరథుని తగువిధముగా ఆహ్వానించెను. అట్లే జనకమహారాజు యొక్క ధర్మనిరతిని, శీలవైభవమును స్మరించి, ఇది తగిన సంబంధమని భావించిరి దశరథుడు మరియు ఆతని గుర్వమాత్యులు. వివాహముహూర్త నిర్ణయము, ఇరు వంశాల ప్రవరకీర్తనము జరిగినతరువాత రాజర్షియైన జనకుడు ఈ ధర్మోక్తమైన శ్లోకమును చెప్పెను “ఓ దశరథమహారాజా! రామలక్ష్మణులకు శాస్త్రోక్తముగా గోదాన…