సాఽపనీయ తమాయాసం ఉపస్పృశ్య జలం శుచిః । చకార మాతా రామస్య మఙ్గళాని మనస్వినీ ॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చవింశస్సర్గః (౧) రాముడు అడవులకు వెళ్ళుటయే ధర్మమని నిశ్చయించుకున్న కౌసల్యాదేవి శ్రీరాముని ఆశీర్వదించుటకు ఉపక్రమించెను. ఆ సందర్భములో వాల్మీకిమహర్షి చెప్పిన శ్లోకమిది “నిర్మలమైన మనస్సుగల ఆ కౌసల్యామాత దుఃఖమును వీడి, పవిత్రజలములను ఆచమించి శుచియై, శ్రీరామునకు శుభాశీస్సులను పలికెను”. ఈ శ్లోకము ద్వారా వాల్మీకిమహర్షి శుచిత్వము, ముఖ్యముగా ఆచమనము యొక్క ప్రాధాన్యతను ఆవిష్కరిస్తున్నారు: ఈ మధ్యకాలములో కొందరు మనస్సు మంచిదైతే చాలు, బాహ్య శుచి అక్కరలేదు అని నాస్తికవాదములను ప్రచారము చేయుచున్నారు. అట్టివారికి ఈ…

ప్రాఞ్జలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత । అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే షట్చత్వారింశస్సర్గః (౨౨) విశ్వామిత్రులవారు శ్రీరామునికి బోధించిన మరో రమ్యమైన శ్లోకమిది. దీని అర్థమేమంటే — దేవేంద్రుడు తన పినతల్లియైన దితికి నమస్కరిస్తూ ఈ మంచిమాటలను చెప్పినాడు “దేవీ! నీవు పాదములు పెట్టుకునే వైపు తల పెట్టుకుని పడుకున్నందున అశుచివైనావు”. అశుచియైనవాడు ఏ కార్యానికైనా అనర్హుడు కావున, మనము ఇట్టి పనులు చేయరాదని విశ్వామిత్రులవారి సందేశము. ఒకవేళ అశుచులమైనా, వెంటనే స్నానాచములద్వారా శుచిని పొందవలెను. ఆ తరువాతనే కార్యోన్ముఖులము కావలెను. అంతేకాక తల్లి లేదా తత్సమానమైన వారిమీద ఎంత గౌరవభావనతో ఉండాలోకూడా ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. పెద్దలైనవారు,…

అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమమ్ । స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే త్రయోవింశస్సర్గః (౧౭) వసిష్ఠుడంతటి  బ్రహ్మర్షిచే “ఏష  విగ్రహవాన్  ధర్మ” (మూర్తీభవించిన ధర్మస్వరూపుడు) అని  కొనియాడబడ్డ  విశ్వామిత్రునితో  పయనిస్తున్న  రామలక్ష్మణులు  పవిత్రమైన  సరయూగంగా  సంగమస్థానానికి   సాయంకాలసమయములో చేరుకున్నారు.  అక్కడే  పరమేశ్వరుడు  తపస్సు  చేసిన  అతి  పవిత్రమైన  ఆశ్రమము  ఉన్నది.  కామదహనము  జరిగినదీ  అక్కడే.  అట్టి  పవిత్రమైన  ఆశ్రమమును  ప్రవేశించేముందు, విశ్వామిత్రులవారు  ఈ  శ్లోకము  చెప్పారు:  “మనమందరము  శుచులమైన  తరువాతనే  ఈ  పవిత్ర  ఆశ్రమములోనికి  ప్రవేశిద్దాము.  పైగా  ఇక  సూర్యాస్తము  కానున్నది  కావున  సంధ్యావందనము,  గాయత్రీ  జపము,  అగ్నికార్యములు  చేసుకొని  ఆ …