నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మైథిలీమ్ । నైవ సర్వానిమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితమ్ ॥ త్వామహం సత్యమిచ్ఛామి నానృతం పురుషర్షభ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతుస్త్రింశస్సర్గః (౪౭-౪౮) ‘ధర్మమును ఎందుకు పాటించవలెను?’ అన్న ప్రశ్నకు సరియైన సమాధానము శ్రీరాముడు ఈ శ్లోకముల ద్వారా ఇచ్చినారు. దైవసమానుడైన తండ్రిని సత్యమునందు నిలుపుట – అనే ధర్మముపైననే తనకు మక్కువకలదనీ, రాజ్యముపైనగానీ, తన ప్రాణసమానమైన సతిపైగానీ, తన జీవితముపైగానీ , పరలోకగతులపైగానీ తనకు మక్కువలేదని తేల్చిచెప్పినాడు. కాబట్టి ధర్మమును కేవలము ధర్మముకోసమే పాటించవలెను కానీ ఇహ, పర సుఖములు కాంక్షించి కాదని శ్రీరాముని సందేశము. జీవితముపై కానీ, ఇతర ప్రాణాధికమైన వస్తువుల (శ్రీరామునికి సీత) పైకానీ మక్కువ కంటే…

బ్రహ్మణస్స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ । న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే త్రిషష్టితమస్సర్గః (౧౯) విశ్వామిత్రుడు ఒక ధార్మికమైన మహారాజుగా సాధనమొదలు పెట్టి, తీవ్రమైన తపస్సుచే క్రమముగా ధనుర్వేదమంతయూ ఔపాసన పట్టి, రాజర్షియై, తరువాత మహర్షి అయ్యెను. పిదప ఆయన కౌశికీనదీ తీరమున ఇంద్రియనిగ్రహమునకై వెయ్యేండ్లు ఘోరతపమాచరించెను. ఆ తపస్సుకు మెచ్చి దేవతలతో కలిసి లోకేశ్వరుడైన బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి “నీవు ఋషులలోకెల్లా శ్రేష్ఠుడవు కావున, నీకు మహర్షిత్వమును ఒసంగుతున్నాను”, అని వరమిచ్చెను. ఆ వచనములను వినిన విశ్వామిత్రులవారు పొంగిపోలేదు అలాగని క్రుంగిపోలేదు, అని శతానందమహర్షి ఈ శ్లోకముద్వారా రామలక్ష్మణులకు విశ్వామిత్రుని మాహాత్మ్యమును…