బ్రాహ్మణో హ్యేకపార్శ్వేన నరాన్ రోద్ధుమిహార్హతి । న తు మూర్ధాభిషిక్తానాం విధిః ప్రత్యుపవేశనే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౧౭వ శ్లోకము) ఎందరు ఎంత చెప్పినా శ్రీరాముడు అయోధ్యకు మరలిరావటం లేదు. ఈ పరిస్థితిలో ఏమిచేయాలో పాలుపోక భరతుడు శ్రీరాముడు కదలివచ్చేవరకు నిరాహారదీక్షపట్టి ఆయనకు అడ్డముగా పరుందామనుకొనెను. ఆ ప్రయతమును వారిస్తున్న శ్రీరాముడిలా పరమధర్మవచనములను పల్కెను: “అధర్మమును ఎదురుకోడానికి సాధుజీవనులైన బ్రాహ్మణులు ఇట్లా ఒకవైపుకు పరుండి నిరాహారదీక్షను చేయుట తగును. కానీ క్షత్రియులకు ఇది ధర్మముకాదు (వారు తమ శక్తిసామర్థ్యములద్వారేనే పనులు సాధించవలెను). కాబట్టి, నీవీప్రయత్నమును విరమింపుము”.

నహ్యస్మాభిః ప్రతిగ్రాహ్యం సఖే! దేయం తు సర్వదా । ఇతి తేన వయం రాజన్ అనునీతా మహాత్మనా ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే సప్తాతీతిశమస్సర్గః (౧౬వ శ్లోకము) గుహుడు భరతునితో శ్రీరాముని సత్యపరాక్రమము, ధర్మనిరతిని, శ్లాఘిస్తూ అతడు భక్షభోజ్యాలు సమర్పించినప్పుడు, వాటిని అతి సున్నితముతా నిరాకరిస్తూ శ్రీరాముడు పలికిన ధర్మోక్తులను ఈ శ్లోకము ద్వారా చెప్పెను: “ మహాత్ముడైన శ్రీరాముడు నన్ను ఈ క్రింది అనునయ వాక్యాలతో బుజ్జగించెను: ’ఓ ప్రియసఖా! మావంటి క్షత్రియులు ఎప్పుడూ (ప్రజలకు) ఇవ్వవలెనే కానీ, ఎన్నడూ (ప్రజలనుండి) పుచ్చుకోకూడదు’.” మనము నేర్వవలసిన నీతులు: క్షత్రియులు ఎప్పుడూ అర్హులైన అర్థులకు వారి కామ్యములను…

ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః । త్వాం చ మాం చ హి ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువమ్ ॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టసప్తతితమస్సర్గః (౨౩వ శ్లోకము) తన పన్నాగము పండెనన్న ఆనందంతో, సర్వాలంకారాలు చేసుకొని, కులుకుచూ తిరుగుతున్న కుబ్జను చూసి, దానిని దండిద్దామని భరతుని వద్ద లాక్కువచ్చిన శత్రుఘునితో భరతుడీ అమృతవాక్కులు పలికెను: “(ఇంత ద్రోహానికి ఒడికట్టి, ఇంతమందిని క్షోభపెట్టిన) ఈ కుబ్జ వధార్హురాలే. కానీ మనము ఈమెను శిక్షించినామన్న వార్త శ్రీరామునికి తెలిస్తే, (స్త్రీ, పైగా దాది, అనగా పెంచిన తల్లివంటిది, అయిన కుబ్జను శిక్షించిన మహాపాపము చేసినందుకు) అతడు ఇంక మనతోమాట్లాడడు”. నిజమైన భగవద్భక్తుడు…

హన్యాహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీమ్ । యది మాం ధార్మికో రామో నాసూయేన్మాతృఘాతుకమ్ ॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టసప్తతితమస్సర్గః (౨౨వ శ్లోకము) తన పన్నాగము పండెనన్న ఆనందంతో, సర్వాలంకారాలు చేసుకొని, కులుకుచూ తిరుగుతున్న కుబ్జను చూసి, దానిని దండిద్దామని భరతుని వద్ద లాక్కువచ్చిన శత్రుఘునితో భరతుడీ అమృతవాక్కులు పలికెను: “అంతఃపురవాసులని, ప్రజలని, అందరిని, ఇంత తీర్వమైన వ్యధకు లోనుచేసిన ఈ కైకేయి (కుబ్జకంటే) మహాపాపమే చేసినది. సాధారణ దృష్టిలో ఈమె వధార్హురాలే. కానీ మనము కైకెయిని శిక్షిస్తే, ‘(తల్లి బిడ్డలకు ద్రోహము చేసినా) తయలులకు తల్లిని శిక్షుట తగదన్న’ ధర్మసూక్ష్మము ఎరిగిన శ్రీరాముడు,…

ఏవం పాపసమాచారః సజ్జనప్రతిబాధకః । పౌరాణామహితే యుక్తః పుత్త్రో నిర్వాసితః పురాత్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే అష్టత్రింశస్సర్గః (౨౧) సగరుడు తన భార్యలైన కేశిని మరియు సుమతి తో కలిసి ౧౦౦ సంవత్సరాలు కఠోర తపస్సుచేసెను. ఆ తపఃఫలముగా కేశినికి అసమంజసుడు, సుమతికి కి ౬౦౦౦౦ మంది సంతానము కలిగెను. కానీ పెద్దకొడుకైన అసమంజసుడు ఒక విచిత్రమైన హింసాప్రవృత్తి కలవాడాయెను. అతడు నగరములోని చిన్నపిల్లలిని ఎత్తుకొచ్చి నీళ్ళలోకి తోసేవాడు. వాళ్ళు గిలగిలకొట్టుకుంటుంటే చూసి పకపకా నవ్వేవాడు. ఎన్నిసార్లు మందలించినా మారని కుమారుని చివరకు నగరక్షేమార్థుము సగరుడు రాజ్యబహిష్కృతుని చేసెను. లేకలేక…

ధర్మాత్ ప్రచ్యుతశీలం హి పురుషం పాపనిశ్చయమ్ ।  త్యక్త్వా సుఖమవాప్నోతి హస్తాదాశీవిషం యథా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే యుద్ధకాణ్డే  సప్తాశీతితమస్సర్గః (౨౨) తనవారిని వదిలి పరులను ఆశ్రయించావని దూషించిన ఇంద్రజిత్తుకి విభీషణుడిచ్చిన ధర్మోచితమైన సమాధానమిది. “ఎలాగైతే చేతికి చుట్టుకున్న విషసర్పమును వదిలించుకుంటామో, అట్లే ధర్మాన్ని వదిలి పాపకార్యాలయందు నిమగ్నుడైన వాడు, తండ్రిసమానుడైన అన్నగారైనా సరే, వాడిని వదిలివేయాలిసిందే” అని చెప్తాడు.  అదీకాక, విభీషణుడు ఎన్నోమార్లు రావణునితో అధర్మమును విడనాడమనీ, సీతమ్మను తిరిగి శ్రీరామునికిచ్చివేయమనీ హితవు చెప్పాడు. కానీ ఆ మంచి మాటలు చెవికెక్కని రావణుడు విభీషణుని రాజ్యబహిష్కారము చేశెను. అప్పుడు విభీషణుడు ధర్మాత్ముడైన శ్రీరామునిశరణువేడినాడు.ఇట్టి నిష్పక్షపాతమైన సూక్ష్మబుద్ధి కలవాడుకనుకనే శ్రీరాముడు విభీషణుకి శరణమిచ్చి, కాపాడి, మోక్షమిచ్చెను (ప్రహ్లాదుడు…