నైవమర్హథ మాం వక్తుం ఆజ్ఞాప్తోహం తపస్వినామ్ ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షష్ఠస్సర్గః (౨౨వ శ్లోకము) రాక్షసులబారినుండి కాపాడమని ప్రార్థించిన ఋషులతో శ్రీరాముడిట్లనెను: “ఓ మహాత్ములారా! మీరు నన్ను ఇట్లు ప్రార్థించుట ఏ మాత్రమూ తగదు. నేను తాపసుల ఆజ్ఞలను పాలింపవలసినదే”. తాను సామ్రాజ్యానికి రాజైకూడా శ్రీరాముడు ఎంతో వినయముతో వర్తించెను. ఇట్టి వినయమే మహాత్ములకు అలంకారము. ఋషుల తపస్సు, వారి ధర్మము కాపాడుట రాజు యొక్క కర్తవ్యమని శ్రీరాముని సందేశము.

న త్వాం ప్రవ్యథయేద్ధుఃఖం ప్రీతిర్వా న ప్రహర్షయేత్ । సమ్మతశ్చాసి వృద్ధానాం తాంశ్చ పృచ్ఛసి సంశయాన్ ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షడుత్తరశతతమస్సర్గః (౨-౩వ శ్లోకములు) శ్రీరామునిలోని ఉత్తమగుణములను కీర్తిస్తూ భరతుడిలా అనెను: “ఓ రామా! నీవు కష్టములు వస్తే కుంగిపోవు, సుఖములు వస్తే పొంగిపోవు. నీవు సర్వజ్ఞుడైనప్పటికీ పెద్దలను వినయపూర్వకముగా సందేహములు అడిగి తెలుసుకుంటావు”.

సమాప్తవనవాసం మాం అయోధ్యాయాం పరన్తప । కోను శాసిష్యతి పునః తాతే లోకాన్తరం గతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వ్యుత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము) దశరథమహారాజు మరణించారన్న పిడుగులాంటి వార్త వినగానే నిలువునా నరికిన చెట్టులాగా దుఃఖముతో కుప్పకూలిపోయాడు శ్రీరాముడు. ఎట్టకేలకు తేరుకొని ఈ శ్లోకము పలికినాడు: “౧౪ ఏళ్ళ వనవాసము తరువాత నేను అయోధ్య చేరితే, ఇక నన్ను శాసించి, నా మంచి చెడ్డలు చూచుకుని, హితవచనములు చెప్పేది ఎవరు?” అని విలపించెను. Independence, individuality, freedom to explore అనే నినాదాలు చేసే నేటి యువతకు శ్రీరాముని ఈ మాటలు మార్గదర్శకములు కావలెను.…

పాద్యమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహితా । ప్రతిజగ్రాహ కాకుత్స్థో విధిదృష్టేన కర్మణా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకోనపఞ్చాశస్సర్గః (౧౮) “అహల్యాదేవి శ్రీరామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాదులిచ్చి, తగురీతిలో ఆతిథ్యమిచ్చెను. ఇది కేవలము విధివశాత్ జరుగుతున్న సత్కారమని భావించి వారుకూడా ఆ ఆతిథ్యమును స్వీకరించిరి”, అని ఈ శ్లోకమునకు అర్థము. “అతిథి దేవో భవ” అన్న సూత్రానికి భాష్యముగా నిలిచే ఈ శ్లోకము చిరస్మరణీయము. ఇంటికి వచ్చిన అతిథిని సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి ఆయనకు పాద్యము (కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవలెను), అర్ఘ్యము (చేతులు కడుగుకోవటానికి నీళ్ళు ఇచ్చి), ఆచమనము చేయుటకు శుద్ధజలము ఇచ్చి, ఇంటిలోనికి ఆహ్వానించి, తగురీతిలో అతిథిని…

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా । స్మరన్తీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకోనపఞ్చాశస్సర్గః (౧౭) “శ్రీరామలక్ష్మణులు మహాపతివ్రతామ్మ తల్లియైన అహల్యకు శిరసువంచి పాదాభివందనము చేసిరి. ఆ తరువాత తన పతియైన గౌతముని మాటలు గుర్తుకు వచ్చి వెంటనే అహల్య కూడా శ్రీరామలక్ష్మణులకు పాదాభివందనము చేశెను” అని ఈ శ్లోకార్థము. పతివ్రత యొక్క మహోన్నతస్థానమును చాటిచెప్పే ఈ శ్లోకము నేటి మన సమాజానికి మార్గదర్శకము కావలెను. పతివ్రతయైన ఇల్లాలు అందరిచేత, సాక్షాత్ పరమాత్మ చేతకూడా వందనీయురాలని, పరమపూజ్యురాలని, వాల్మీకిమహర్షి ఈ శ్లోకముద్వారా నిరూపిస్తున్నారు. శ్రీరామలక్ష్మణుల యొక్క వినయవైభవము కూడా ఈ శ్లోకము ద్వారా…

ప్రాఞ్జలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత । అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే షట్చత్వారింశస్సర్గః (౨౨) విశ్వామిత్రులవారు శ్రీరామునికి బోధించిన మరో రమ్యమైన శ్లోకమిది. దీని అర్థమేమంటే — దేవేంద్రుడు తన పినతల్లియైన దితికి నమస్కరిస్తూ ఈ మంచిమాటలను చెప్పినాడు “దేవీ! నీవు పాదములు పెట్టుకునే వైపు తల పెట్టుకుని పడుకున్నందున అశుచివైనావు”. అశుచియైనవాడు ఏ కార్యానికైనా అనర్హుడు కావున, మనము ఇట్టి పనులు చేయరాదని విశ్వామిత్రులవారి సందేశము. ఒకవేళ అశుచులమైనా, వెంటనే స్నానాచములద్వారా శుచిని పొందవలెను. ఆ తరువాతనే కార్యోన్ముఖులము కావలెను. అంతేకాక తల్లి లేదా తత్సమానమైన వారిమీద ఎంత గౌరవభావనతో ఉండాలోకూడా ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. పెద్దలైనవారు,…

ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ । ఆజ్ఞాపయతి యథేచ్ఛం వై శాసనం కరవామ కిమ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకత్రింశస్సర్గః (౪) యాగమును రాక్షసుల బారినుండి కాపాడుటే కాక మారీచసుబాహుల బెడద మునులకు తీర్చి ముదముకూర్చిన రామలక్ష్మణులను చూసి మురిసిపోయిన విశ్వామిత్రుడు “ఓ మహాబాహో రామచంద్ర! నన్ను కృతార్థుడిని చేశావయ్యా. ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమమను అను పేరు సార్థకముచేసినావు” అని పొగిడెను. గురువుగారి యాగము నిర్విఘ్నముగా జరిగిందనే సంతోషముతో రామలక్ష్మణులు హాయిగా ఆ రాత్రి నిదురించిరి. రామలక్ష్మణులు ఆరు రోజులు నిద్రాహారాలు మాని నిరంతరాయముగా యాగాన్ని కాపాడి అలసిపోయి గాఢనిద్రపోయినాకూడా వారు తెల్లవారుఝాముననే సకాలములో నిద్రలేచి, సంధ్యావందనాది ఆహ్నికాలు తీర్చుకుని,…