భయం కచ్చిన్న చాస్మాసు కుతశ్చిద్విద్యతే మహత్ । కుతో నిమిత్తః శోకస్తే బ్రూహి సర్వహితైషిణి ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతుస్సప్తతితమస్సర్గః (౨౧వ శ్లోకము) ఒకానొకప్పుడు కామధేనువు తన కొడుకులైన రెండు శుష్కించిన ఎద్దులు వ్యవసాయములో పడే కష్టమును గమనించి, శోకించసాగెను. అటుగా వెళుతున్న దేవేంద్రుడు కామధేనువు యొక్క దుస్స్థితిని గమనించి, ఈ శ్లోకము ద్వారా, ఆమెను ఇలా ప్రశ్నించినాడు: “అందరి మేలు కోరే ఓ తల్లి! గోమాతా! ఏ కారణముగా నీవు శోకిస్తున్నావు? పొరపాటుగా మా దేవతలలో ఎవరివల్లైనా నీకు ఆపద సంభవించ లేదు కదా?”. ఈ శ్లోకము ద్వారా మనము తెలుసుకోతగ్గ నీతులు: ఆత్మవిచారణ అనేది దివ్యగుణము. శోకార్తురాలైన…

కచ్చిన్మయా నాపరాద్ధం అజ్ఞానాద్యేన మే పితా । కుపితస్తన్మమాచక్ష్వ త్వం చైవైనం ప్రసాదయ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టదశస్సర్గః (౧౧వ శ్లోకము) ఎన్నడూ తన తండ్రిలో చూడని (కైకేయిపై) క్రోధమును చూచి శ్రీరాముడు కైకేయితో ఇట్లు పల్కెను “అమ్మా! నావల్ల ఏదైనా అపరాధము అజ్ఞానవశాత్తు జరిగిందా? ఏ కారణముగా తండ్రిగారు కుపితులై ఉన్నారు? దయ ఉంచి ఆయనను శాంతిపరచుము. అట్లు చేయుటకు నీవే సమర్థురాలవు”. ఈ శ్లోకముద్వారా మనము నేర్వవలసిన నీతులు: శ్రీరామునిలోని ఆత్మపరిశీలనా లక్షణము మనము నేర్వ వలెను. అతడు ఎంత ధర్మాత్ముడైననూ, ప్రథముగా తనలో దోషములేదు కదా అని విచారించును.…