భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ । త్వయా నాథేన ధర్మాత్మా న సంవృతః పితా మమ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౨౯వ శ్లోకము)  “ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, అయిన ఓ లక్ష్మణ, నా మనసులోని భావములను సైతం గ్రహించి, నన్ను రక్షించే నీవుండగా, నా తండ్రి దశరథుడు మరణించనట్టే నేను భావిస్తాను”. లక్ష్మణుని సేవాధర్మము తో పాటు, శ్రీరాముని భ్రాతృప్రీతి కూడా ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది.

పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే । స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౭వ శ్లోకము) పంచవటి ప్రదేశమునకు చేరిన తరువాత పుష్కళముగా సమిధలు, పుష్పములు, కుశలు, నీళ్ళు (మొదలైన పూజాసామాగ్రి) దొరికే ప్రదేశములో కుటీరము నిర్మించవలెననుకొనెను శ్రీరాముడు. కుటీర నిర్మాణమునకు అనువైన ప్రదేశమును ఎంచుమని బుద్ధిశాలియైన లక్ష్మణునికి చెప్పెను శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు ఈ ధార్మికవాక్కులను పల్కెను: “ఓ రామా! ఎన్ని వందల సంవత్సరములు గడిచిననూ (నేనెంత పేద్దవాడనైననూ) నేను నీకు అధీనుడనే. కావున నీవే స్థల నిర్ణయము చేసి, కుటీరనిర్మాణము చేయుమని నన్నాజ్ఙాపించుము”. ఆదర్శ…

రథస్థః స హి ధర్మాత్మా భరతో భ్రాతృవత్సలః । నన్దిగ్రామం యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము) భ్రాతృప్రేమగల భరతుడు, శ్రీరాముని పాదుకలు శిరస్సున ఉంచుకొని నందిగ్రామ ప్రయాణము చేసెను. మనము కూడా భరతునివలె భగవంతుని నెత్తినపెట్టుకొని, ఆయన ఆజ్ఞలైన ధర్మములను శిరోధార్యములుగా పాటించవలెను.

ఆసనం పూజయామాస రామాయాభి ప్రణమ్య చ । వాలవ్యజనమాదాయ న్యషీదత్ సచివాసనే ॥

శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ఏకనవతితమస్సర్గః (౩౮వ శ్లోకము) భరధ్వాజముని తన తపశ్శక్తితో విశ్వకర్మని ఆహ్వానించి, భరతుడు మరియు అతని పరివారము ఆ రాత్రికి విడిదిచేయుటకు, ఒక అలౌకికమైన దివ్య భవనమును సృష్టించెను. అప్పుడు ఆ భవనములో ప్రవేశించిన భరతుడు “సభలోనున్న ఉత్కృష్టమైన సింహాసనముపై శ్రీరాముడు విరాజమానమై ఉన్నట్టు భావించి, దానిని పూజించి, నమస్కరించెను. తరువాత, ఒక సచివుడు కూర్చునే ఆసనముపై తాను కూర్చొనెను.” మనము నేర్వవలసిన నీతులు: ఒక ఇంట్లో అన్నిటికన్నా శేష్ఠమైన ప్రదేశములో, శ్రేష్ఠమైన ఆసనముపై భగవంతుని…

వ్యసనీ వా సమృద్ధో వా గతిరేష తవానఘ । ఏష లోకే సతాం ధర్మో యజ్జ్యేష్ఠవశగో భవేత్ ॥

సౌమిత్రీదేవి లక్ష్మణునితో ఇలా అన్నది: “కష్టసుఖాలన్నిటిలో శ్రీరామునికి నీవు విధేయుడవై ఉండుము. ఉత్తముడైన అన్నను అనుసరించుటే అనుజుల కర్తవ్యము కదా!”. కుటుంబకలహాలతో కొట్టుమిట్టాడే ఈ సమాజానికి ఈ శ్లోకము మార్గదర్శకము కావలెను.