బ్రాహ్మణో హ్యేకపార్శ్వేన నరాన్ రోద్ధుమిహార్హతి । న తు మూర్ధాభిషిక్తానాం విధిః ప్రత్యుపవేశనే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౧౭వ శ్లోకము) ఎందరు ఎంత చెప్పినా శ్రీరాముడు అయోధ్యకు మరలిరావటం లేదు. ఈ పరిస్థితిలో ఏమిచేయాలో పాలుపోక భరతుడు శ్రీరాముడు కదలివచ్చేవరకు నిరాహారదీక్షపట్టి ఆయనకు అడ్డముగా పరుందామనుకొనెను. ఆ ప్రయతమును వారిస్తున్న శ్రీరాముడిలా పరమధర్మవచనములను పల్కెను: “అధర్మమును ఎదురుకోడానికి సాధుజీవనులైన బ్రాహ్మణులు ఇట్లా ఒకవైపుకు పరుండి నిరాహారదీక్షను చేయుట తగును. కానీ క్షత్రియులకు ఇది ధర్మముకాదు (వారు తమ శక్తిసామర్థ్యములద్వారేనే పనులు సాధించవలెను). కాబట్టి, నీవీప్రయత్నమును విరమింపుము”.

న భూమ్యా కార్య మస్మాకం న హి శక్తాః స్మ పాలనే । రతాః స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే చతుర్దశస్సర్గః (౪౫) అశ్వమేధము, విశ్వజిత్ మొదలైన యజ్ఞములు నిర్వహించినవారు, యజ్ఞాంతములో తమకు ఉన్న సంపదనంతా దానము ఇచ్చివేయాలి! పుత్రప్రాప్తికై అశ్వమేధము చేసిన దశరథుడు శాస్త్రానుసారము `హోత’ అను ఋత్విజునకు తూర్పుదిక్కున ఉన్న తన యావత్ సామ్రాజ్యాన్ని దానమిచ్చెను. అట్లే `ఆధ్వర్యువునకు’ పడమరదిక్కు, `బ్రహ్మకు’ (ఋష్యశృంగునకు) దక్షిణదిక్కు, `ఉద్గాతకు’ ఉత్తరదిక్కున ఉన్న రాజ్యమును దానమిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణులు ధర్మోచితమైన ఈ శ్లోకమును చెప్పిరి: “ఓ ఉదారుడైన మహారాజా! మేము బ్రాహ్మణులము కావున మాకు ప్రీతికరమైన ది స్వాధ్యాయమొక్కటే (అనగా వేదశాస్త్ర అధ్యయనము, దాని అనుష్ఠానము, మరియు శిష్యులకు దానిని…