దీయమానాం న తు తదా ప్రతిజగ్రాహ రాఘవః । అవిజ్ఞాయ పితుశ్ఛన్దం అయోధ్యాధిపతేః ప్రభోః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టాదశోత్తరశతతమస్సర్గః (౫౧వ శ్లోకము) శివధనుస్సును ఎక్కుపెట్టిన శ్రీరాముని చూసి పొంగిపోయి, తన కూతురైన సీతని శ్రీరామునికి ధారపోయుటకు ఉద్యమించెను జనకుడు. అప్పుడు శ్రీరాముడు జనకమహారాజుతో తన తండ్రిగారైన దశరథుని అనుమతి లేనిదే సీతను గ్రహించలేనని చెప్పెనని ఈ శ్లోకార్థము. వివాహాదివిషయాలలో నిర్ణయము తల్లిదండ్రులదేయని తేల్చిచెప్పే రాముని ఈ వచనములు ఇప్పటి యువతకు మార్గదర్శకము కావలెను.

పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి నః | యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||

— వాల్మీకిరామాయణే బాలకాణ్డే ద్వాత్రింశస్సర్గః (౨౨) రూపయవ్వనవతులైన కుశనాభుని కుమార్తెలు ఏకాంతములో ఉన్నప్పుడు వారిని మోహించిన వాయువు తనని పెండ్లి ఆడమని వారిని అర్థిస్తాడు. తన భార్యలైతే వారికి అమరత్వము మఱియు నిత్యయవ్వనము లభిస్తాయని ప్రలోభపెడతాడు. కానీ వారు ప్రలోభపడక, సర్వాత్మకుడైన వాయువునకు ఇలా హితవుపలుకుతారు. వరనిర్ణయాధికారము తమకులేదని, ఆ అధికారము కేవలము సత్యవాదియైన తమ తండ్రిగారిదే అని తేల్చిచెప్పేస్తారు. తమ పాలిట పరమదైవమైన తండ్రిగారు నిర్ణయించిన వానినే భర్తగా స్వీకరిస్తామని అంటారు. అందుకని ఇట్టి దురాలోచన…