ధర్మార్థకామాః ఖలు తాత! లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు । తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకవింశస్సర్గః (౫౬) కౌసల్యాదేవికి, మరియు లక్ష్మణుకి, శ్రీరామునిపై ఎంత ప్రీతి ఉన్నదంటే శ్రీరాముడంతటి వాగ్విదాంవరునికే వారిని ఒప్పించటానికి ఎన్నోమాటలు పట్టాయి. ఈ మాటలే సుమారు ౪ సర్గలలోని శ్లోకాలుగా మనకందించారు వాల్మీకిమహర్షి! ఈ వాక్చాతుర్యానికి వాల్మీకంతటివాడే పొంగిపోయి, ఉండబట్టలేక, “ఇలా మాట్లాడుట శ్రీరామునికే చెల్లుతుంది” అని తేల్చిచెప్పేశారు. ధర్మం యొక్క ప్రాముఖ్యత, మరియు “భార్యా” అనే పదమునకు నిర్వచమును ఇచ్చే ఈ అద్భుతమైన శ్లోకము శ్రీరాముడు కౌసల్యాసౌమిత్రులతో చెప్పెను. ఈ శ్లోకార్థమేమనగా “నిస్సందేహముగా ధర్మార్థకామమోక్షాలనే…

ధర్మాయ యశసేఽర్థాయ కామాయ స్వజనాయచ । పఞ్చధా విభజన్ విత్తం ఇహాముత్రచ శోభతే ॥

శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కన్ధే ఏకోనవింశోఽధ్యాయః (౩౭) శుక్రాచార్యులవారు ధనమును క్రమ పద్ధతిలో ఖర్చుపెట్టే పద్ధతిని బలిచక్రవర్తికి వివరిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు: “ఈ క్రింది ఐదు అంశాలకు నష్టము కలుగకుండా ధనమును విభజించి ఖర్చుపెట్టినవాడే ఇహపరసాధన చేయగలడు: ధర్మకార్యాలు కీర్తి ధర్మబద్ధమైన అర్థార్జన ధర్మబద్ధమైన కోరికలు స్వజనుల పురుషార్థములు” ఈ సూత్రమును పాటించగలితే నిజముగా మనము ధన్యులమే అవుతాము.