ఏష్టవ్యా బహవః పుత్త్రా గుణవన్తో సహుశ్రుతాః । తేషాం వై సమవేతానాం అపి కశ్చిద్గయాం వ్రజేత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తాధికశతతమస్సర్గః (౧౩వ శ్లోకము) పుత్రులయొక్క కర్తవ్యమును భరతునికి బోధిస్తూ శ్రీరాముడన్న ధర్మవచనములివి: “శాస్త్రము బాగా తెలిసినవారు గుణవంతులైన పెక్కుమంది పుత్రులు కలగాలని కోరుకొనెదరు. ఏలన, వారిలో ఒక్కడికైనా గయలో పితృదేవతా తృప్తికై శ్రాద్ధము చేసే బుద్ధి పుట్టునేమోనని”. గయాది పుణ్యక్షేత్రములలో శ్రాద్ధకర్మను శాస్త్రోక్తముగా ఆచరించుట యొక్క ప్రధాన్యతను తెలిపే ఈ శ్లోకము చిరస్మరణీయము.

ఇదం భుఙ్క్ష్వ మహారాజ ప్రీతో యదశనా వయమ్ । యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వ్యుత్తరశతతమస్సర్గః (౩౦వ శ్లోకము) తండ్రికి జలతర్పణాలు విడిచి, యథావిధిగా పిండోదకక్రియలు నిర్వహించినాడు శ్రీరాముడు. పిండప్రదానము చేస్తూ ఈ ధర్మోక్తిని పల్కెను శ్రీరామచంద్రుడు: “ఓ మహారాజా! ప్రీతితో మేము సమర్పించే (రేగుపండ్లతో కలిపిన) ఈ గారపిండి ముద్దలను స్వీకరించండి. మానవులు తమకి పారంపర్య ధర్మానుసారముగా లభించిన ఆహారమునే దేవతలకు భక్తితో నివేదింతురు కదా! (అట్టి నైవేద్యము దేవతలను తృప్తిపరచును కదా!)”. మనము నేర్వవలసిన నీతులు: మహాజ్ఞానియైన శ్రీరాముడు యథావిధిగా తండ్రికి భక్తితో శ్రాద్ధక్రియలను జరిపించెను. కన్న…

దాతం చ తావదిచ్ఛామి స్వర్గతస్య మహీపతేః । ఔర్ధ్వదేహనిమిత్తార్థం అవతీర్యోదకం నదీమ్ ॥

శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే త్ర్యశీతితమస్సర్గః (౨౪వ శ్లోకము) శ్రీరామదర్శనముకై బయలుదేరిన భరతుడు గంగాతీరము చేరెను. ఆ పుణ్యనదినిచూచి భరతుడు తన పరివారముతో ఇట్లు పల్కెను: “స్వర్గస్థుడైన దశరథమహారాజునకు పుణ్యలోకాలు ప్రాప్తించుటకై పవిత్ర గంగాజలములలో దిగి, తర్పణలు, శ్రాద్ధకర్మలు, చేయగోరుచున్నాను”. పుణ్యనదులు, తీర్థముల వద్ద పితృతర్పణలు, శ్రాద్ధకర్మలు విధిగా చేయుట ఉత్తమమని మన శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఇట్లు చేయుట అనాదిగా వస్తున్న సదాచారమని ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది.

తతో దశాహేతిగతే కృతశౌచో నృపాత్మజః । ద్వాదశేహని సమ్ప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తసప్తతితమస్సర్గః (౧వ శ్లోకము) పురోహితోత్తముడైన వసిష్ఠుని ఆదేశముమేరకు శాస్త్రోక్త పద్ధతిలో భరతుడు తన తండ్రిగారైన దశరథునికి ప్రేతకర్మలు నిర్వహించెను. ఈ శ్లోకార్థమేమనగ: “పది దినములు ధరాశయనము మెదలైన శౌచనియమములు యథావిధిగా పాటించిన భరతుడు, ఆ తరువాత శుచియై శ్రాద్ధకర్మలు ప్రారంభించెను”. హైందవమతములో ప్రేతకర్మలకు, శౌచకర్మలకు, మరియు, శ్రాద్ధకర్మలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నందునే ఈ అంశములను వివరించుటకు వాల్మీకిమహర్షి రెండు సర్గలుకేటాయించెను!

ప్రేతకార్యాణి యాన్యస్య కర్తవ్యాని విశామ్పతే: । తాన్యవ్యగ్రం మహాబాహో! క్రియన్తాం అవిచారితమ్ ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే షట్సప్తతితమస్సర్గః (౧౧) దశరథుని తలుచుకుని దుఃఖిస్తున్న భరతుని ఓదార్చి, తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వసిష్ఠుడు ఈ శ్లోకము చెప్పెను: “ఓ మహాబాహూ! మీ తండ్రిగారికి ఆచరింపవలసిన ప్రేతకర్మలను నిర్విచారముగా, ప్రశాంతముగా నిర్వహించుము”. సంతానము యొక్క ప్రథమ కర్తవ్యము మాతాపితరులు బ్రతికుండగా వారి శుశ్రూష, వారు గతించిన తరువాత వారికి ప్రేత, శ్రాద్ధాది కర్మలు విధ్యుక్తముగా నిర్వహించుట. అట్టి ముఖ్య కర్తవ్యమును నిర్వహించునప్పుడు ఏ మాత్రము వ్యగ్రతలకు లోనుకాకుండా శ్రద్ధావిశ్వాసాలతో ప్రశాంతముగా చేయవలెనని బ్రహ్మర్షియైన వసిష్ఠుని…

యథాక్రమం యథాన్యాయం సాగరాణాం మహాయశః । కృతోదకశ్శుచీ రాజా స్వపురం ప్రవివేశ హ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే చతుశ్చత్వారింశస్సర్గః (౧౭-౧౮) భగీరథుడు తన సాంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రసమ్మతమైన పద్ధతిలో తన ముత్తాతలైన ౬౦౦౦౦ మంది సగర కుమారులకు పితృతర్పణలు మరియు పిండప్రదానాలు ఇచ్చి పితౄణము తీర్చుకొని తద్వారా శుచిని పొందెనని విశ్వామిత్రులవారు శ్రీరామునికి ఈ శ్లోకము ద్వారా వివరించెను. పాపబుద్ధితో సాక్షాద్విష్ణు స్వరూపుడైన కపిల మహర్షిని చంపబోయి ఆ మహర్షి యొక్క తపోగ్నికి భస్మమైనారు సగర కుమారులు. స్మృతి శాసనము ప్రకారము “పాపాచరణముచేస్తుండగా మరణించే పాపాత్ములకు ఇచ్చే తర్పణలు మరియు పిండప్రదానములు వారికి చేరక ఆకాశముననే నశించును”. ఈ వధముగా సద్గతులులేక…