ఆశామాశంసమానానాం దీనానామూర్ధ్వచక్షుషామ్ । అర్థినాం వితథాం కుర్యాత్ యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౪౯వ శ్లోకము)  శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి అధర్మమునకు నేను పాల్పడినట్టైతే, సహాయార్థులై దరిచేరే దీనులను లోభముచే ఆదుకోని వాడికి పట్టే దుర్గతే నాకు కలుగుగాక.” అంటే లోభము పనికిరాదు అని భరతుని భావము.

మా స్మ ధర్మే మనో భూయాత్ అధర్మం సునిషేవతామ్ । అపాత్రవర్షీ భవతు యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

a — శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౪౧వ శ్లోకము)  శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి దురాలోచన నాకున్నచో, అర్హతలను ఎరుగక అడ్డదిడ్డముగా దానము చెయుట వంటి అధర్మకార్యాలు చేసే దుష్టునికి పట్టు దుర్గతులే నాకు పట్టుగాక”. కాబట్టి మనము దానము ఇచ్చునప్పుడు దాన గ్రహీత ఆ దానమునకు అర్హుడేనా అని విచారించి, నిర్ణయించాలి. దానార్హుడని నిర్ణయించిన తరువాత, ఆతని నారాయణస్వరూపముగా…

ద్విజస్సుహృద్భృత్యజనోఽథవా తదా దరిద్రభిక్షాచరణశ్చ యోఽభవత్ । న తత్ర కశ్చన్న బభూవ తర్పితో యథార్హ సమ్మాననదానసమ్భ్రమైః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్రయస్త్రింశస్సర్గః (౪౫) సీతారామలక్ష్మణులు అడవులకు వెళ్ళేముందర తమదైన యావత్సంపదను దానము చేసిరి. ఇచ్చేటప్పుడు తమకు సేవలుచేసిన వారిని పేరుపేరున గుర్తుకు ఉంచుకుని వారికి అవసరమైన ధనధనేతరములను దానములిచ్చిరి. వేదపండితులకు అనేక గోవులను దానమిచ్చిరి. దుఃఖార్తులైన త్రిజటుని వంటి ఉత్తములకు ఆర్తిని దీర్చిరి. అక్కడ తృప్తి చెందని వారెవ్వరూ లేరని ఈ శ్లోకార్థము.

శైబ్యః శ్యేనకపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ । అలర్కః చక్షుషీ దత్వా జగామ గతిముత్తమామ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వాదశస్సర్గః (౪౩) శిబి చక్రవర్తి మరియు అలర్కమహారాజు యొక్క ప్రతిజ్ఞావైభవమును ప్రపంచిచే ఈ శ్లోకముద్వారా, అప్రియమైనాసరే ఇచ్చినమాటను నిలబెట్టుకోవాలనే సూక్తిని దశరథునకు కైకేయి బోధించెను. శిబి చక్రవర్తి యొక్క ధర్మనిరతిని పరీక్షించుటకై డేగరూపములో ఇంద్రుడు, పావురముగా అగ్నిదేవుడు, రూపములు దాల్చి వచ్చిరి. డేగనుండి రక్షించుమని పావురము శిబిని శరణువేడినది. క్షతము కాకుండా రక్షించేవాడు క్షత్రియుడు కాబట్టి, శిబిచక్రవర్తి కూడా శరణాగతులను కాపాడవలెనన ప్రతిజ్ఞబూనినవాడే. కానీ డేగ, తను శ్రమించి పట్టుకున్న పావురము ధర్మానుసారము తన ఆహారమని అభ్యంతరము…

ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా । యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్ ॥

– శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకోనసప్తతితమస్సర్గః (౧౪) శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల వివాహ విషయములో రాజర్షి అయిన జనక మహారాజు యజ్ఞము పూర్తి అయిన పిదప ఋషి సమ్మతమైన వివాహము నెరవేర్పుము అని దశరథుని అర్థించెను. దానికి, మాటలలో నేర్పరి, సమర్థుడు అయిన దశరథ మహారాజు పైన చెప్పిన రీతిలో ఈవిధముగా బదులు ఇచ్చెను: “ధర్మములు తెలిసిన మహారాజా! ప్రతిగ్రహమనునది దాత చేతిలోనే వున్నది. దాత ఇచ్చినపుడే ప్రతిగ్రహీత ప్రతిగ్రహించునది. నీ కన్యాదాననిర్ణయాదికమును విని యున్నాము. నీవు…

రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ । పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకసప్తతితమస్సర్గః (౨౨-౨౩) రామలక్ష్మణుల యొక్క శౌర్యప్రతాపాలను స్వయముగా దర్శించి, ఇక్ష్వాకువంశము యొక్క కీర్తిచంద్రికలను యెరిగిన జనకుడు తన కుమార్తెలైన సీతా ఊర్మిళలకు రామలక్ష్మణులే తగినవారని నిర్ణయించి, దశరథుని తగువిధముగా ఆహ్వానించెను. అట్లే జనకమహారాజు యొక్క ధర్మనిరతిని, శీలవైభవమును స్మరించి, ఇది తగిన సంబంధమని భావించిరి దశరథుడు మరియు ఆతని గుర్వమాత్యులు. వివాహముహూర్త నిర్ణయము, ఇరు వంశాల ప్రవరకీర్తనము జరిగినతరువాత రాజర్షియైన జనకుడు ఈ ధర్మోక్తమైన శ్లోకమును చెప్పెను “ఓ దశరథమహారాజా! రామలక్ష్మణులకు శాస్త్రోక్తముగా గోదాన…

తస్మై దత్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః । నిశ్శేషితేన్నే భగవాన్ అభుక్త్వైవ మహాతపాః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే పఞ్చషష్టితమస్సర్గః (౬) ౧౦౦౦ సంవత్సరాలపాటు అన్నపానాదులను, ఉచ్ఛ్వాసాదులను కూడా బిగబట్టి చేసిన కఠోరమైన దీక్ష పరిసమాప్తియైన పిమ్మట, దీక్ష విరమించుటకై భోజనము చేయడానికి సంకల్పించెను విశ్వామిత్రులవారు. శాస్త్రోక్త పద్ధతిలో అన్నమును వండుకొని, భగవంతుని సమర్పించి దాన్ని సిద్ధాన్నముగా జేసికొని దాన్ని తినడానికి ఉపక్రమించబోతున్న సమయములో దేవేంద్రుడు ఆయనని పరీక్షించుటకై ఒక బ్రాహ్మణుగా వచ్చి తనకు అన్నము పెట్టమని అర్థించెను. శతానందులవారు చెప్పిన ఈ శ్లోకము ప్రకారము “అప్పుడు విశ్వామిత్రమహర్షి సిద్ధాన్నమంతటిని ఆ బ్రాహ్మణునకు సమర్పించెను. తృప్తిగా ఆ…

అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాఽపి వా । అవజ్ఞయా కృతం హన్యాత్ దాతరం నాత్ర సంశయః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే త్రయోదశస్సర్గః (౩౦) పుత్రకామేష్టికి సంబంధించిన పనులను నిర్వహించేవారు తాము అంతవరకు పూర్తిచేసిన పనులను విన్నవించడానికి వసిష్ఠులవారి కడకు వచ్చెను. ఆ మహర్షి ఎంతో సంతోషించి, వారిమీద ప్రీతితో ఈ హితోక్తిని పలికెను “మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు అనాదరభావముతో కానీ లేదా చులకనభావముతోకానీ ఇయ్యరాదు. పరిహాసముగా తేలికభావతో ఉండరాదు. అట్లు చేసిన దాత తప్పక నశిస్తాడు”. అందుకని మనమెప్పుడు దానమిచ్చినా దానగ్రహీత మీద అత్యంత ఆదరబుద్ధితో “ఆహా! ఈ మహానుభావుని ఉదారగుణము వల్ల కదా మన ఈ…