స్నేహాచ్చ బహుమానాచ్చ స్మారయే త్వాం న శిక్షయే ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౨౪వ శ్లోకము) శ్రీరాముడు పరస్పర విరుద్ధములైన క్షాత్ర, తాపస ధర్మములు సూక్ష్మబుద్ధితో తూచా తప్పక పాటించాలన్న కాంక్షతో ఒక నీతికథను వినిపించినది సీతాదేవి. అది వినిపించిన తరువాత వినయముతో ఈ శ్లోకము పలికినది: “మీ మీద చనువుతో ఈ కథను మీకు జ్ఞప్తికి తెచ్చితినే కాని, ఇది హితబోధ ఏమాత్రమూ కాదు”. మీదుమిక్కిలి, మీకు ధర్మమును తెల్పగల సమర్థులెవ్వరు? ఒక గురువుతో (పతితో) శిష్యుడు (భార్య) ఎలామాట్లాడాలో ఈ శ్లోకముద్వారా సీతాదేవి మనకు…

తతః ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునః పునః । భరతస్తు యయౌ శ్రీమాన్ అయోధ్యాం సహ మన్త్రిభిః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్రయోదశోత్తరశతతమస్సర్గః (౧౯వ శ్లోకము) భరతుడు పదే పదే భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ పూర్వక నమస్కారములు చేసెనని ఈ శ్లోకపు భావము. గురువులయెడ ఎంతటి వినయవిధేయతలతో మెలగాలో మనము భరతుని వద్ద నేర్వాలి.

పురుషస్యేహ జాతస్య భవన్తి గురవస్త్రయః । ఆచార్య శ్చైవ కాకుత్స్థ పితా మాతా చ రాఘవ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౨వ శ్లోకము) “పుట్టిన ప్రతి మనిషికి ముగ్గురు గురువులుంటారు: (కనిపెంచిన కారణముగా) తల్లి, తండ్రి, (జ్ఞానబోధచేసి ఉద్ధరించిన కారణముగా) ఆచార్యుడు. (కావున వారి ముగ్గురిని పరమ గౌరవముతో సేవించవలెను)” అని వసిష్ఠమహర్షి శ్రీరామునికి ఉపదేశించెను.

కామకారో మహాప్రాజ్ఞ! గురూణాం సర్వదానఘ । ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతురుత్తరశతతమస్సర్గః (౧౮వ శ్లోకము) తనను కాననములకు పంపే సర్వాధికారాలు తండ్రియైన దశరథునికి కలవు అని ప్రామాణికముగా వెళ్ళడిస్తూ శ్రీరాముడు ఈ శ్లోకమును భరతునితో చెప్పెను. “ఓ పాపరహితుడైన బుద్ధిశాలీ! భరతా! గురుస్థానములో నున్న వారికి తమ శిష్యులపై సర్వాధికారములు ఉండును. కావున భార్య భర్తకి, తనయులు తల్లిదండ్రులకి, విద్యార్థి ఆచార్యునికి, విధేయులుగా ఉండవలసినదే”. విధేయత్వమంటే గురువుయొక్క పురుషార్థసాధనమే తమ సాధనగా పెట్టుకొనుట. అందుకనే తండ్రి ఆజ్ఞాపించకపోయినా తండ్రిని సత్యపథముపై నిలబెట్టుటకై శ్రీరాముడు కాననలకు వచ్చెను.…

పురోహితస్యాగ్నిసమస్య వై తదా బృహస్పతేరిన్ద్ర ఇవామరాధిపః । ప్రగృహ్య పాదౌ సుసమృద్ధతేజసః సహైవ తేనోపవివేశ రాఘవః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్య్రుత్తరశతతమస్సర్గః (౨౮వ శ్లోకము) దేవతలకు ప్రభువైన ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించినట్టు, అగ్నిజ్వాలలవలె దివ్యతేజస్సులతో విరాజిల్లుచున్నవాడును, వంశపురోహితుడును అయిన వసిష్ఠమహర్షి యొక్క పాదములకు ప్రణమిల్లెను రాఘవుడు. పిమ్మట ఆయన దగ్గరే వినయంగా కూర్చుండిపోయెను.

సమాప్తవనవాసం మాం అయోధ్యాయాం పరన్తప । కోను శాసిష్యతి పునః తాతే లోకాన్తరం గతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వ్యుత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము) దశరథమహారాజు మరణించారన్న పిడుగులాంటి వార్త వినగానే నిలువునా నరికిన చెట్టులాగా దుఃఖముతో కుప్పకూలిపోయాడు శ్రీరాముడు. ఎట్టకేలకు తేరుకొని ఈ శ్లోకము పలికినాడు: “౧౪ ఏళ్ళ వనవాసము తరువాత నేను అయోధ్య చేరితే, ఇక నన్ను శాసించి, నా మంచి చెడ్డలు చూచుకుని, హితవచనములు చెప్పేది ఎవరు?” అని విలపించెను. Independence, individuality, freedom to explore అనే నినాదాలు చేసే నేటి యువతకు శ్రీరాముని ఈ మాటలు మార్గదర్శకములు కావలెను.…

గాశ్చ స్పృశతు పాదేన గురూన్ పరివదేత్ స్వయమ్ । మిత్రే ద్రుహ్యేత సోఽత్యన్తం యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౩౦వ శ్లోకము)  శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి దురాలోచన నాకున్నచో, కాలితో ఆవును తన్నేవాడు, గురువులను చులకనచేసి మాట్లాడేవాడు, మిత్రద్రోహి పొందే నరకములను నేను పొందేదనుగాక”.

పాయసం కృసరం ఛాగం వృథా సోఽశ్నాతు నిర్ఘృణః । గురూంశ్చాప్యవజానాతు యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౨౯వ శ్లోకము)  శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి దురాలోచన నాకున్నచో, పాయసము వంటి మధుర పదార్థములు, పులగము వంటి రుచియైన (ఉప్పుగల) పదార్థములు, మేకపాలు మెదలైన ఔషధ (పోషక) విలువలున్న పదార్థములు, భగవంతునికి నివేదింపక, అతిథి అభ్యాగతులకు అర్పించక, తినెడి తిండిపోతుకు పట్టే దుర్గతే నాకు కలుగుగాక. అంతేకాక, గురువులను అవమానించెడి ధూర్తుడు పోయే నరకమునకు నేను…

ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమతా । స నాశయతు దుష్టాత్మా యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౨౭వ శ్లోకము)  శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి దురాలోచన నాకున్నచో, జ్ఞానియైన గురువు ప్రయత్నపూర్వకముగా శాస్త్రవిషయములను అతి సూక్ష్మముగా వివరించి బోధించినా, అట్టి ఆప్తవాక్యములను విస్మరించి అధర్మమునకు పాల్పడే దుష్టాత్ముడికి పట్టే దుర్గతే నాకు పట్టుగాక”. భరతుని ఈ వాక్యముల బట్టి, తెలిసి తెలిసి తప్పులు చేయుట మరింత దోషమని రూఢి అగుచున్నది.

మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయన్త్ర్రితః । గురూణాం గురుకార్యాణి కాలే కాలేఽన్వవైక్షత ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే సప్తసప్తీతితమస్సర్గః (౨౫) రామలక్ష్మణులు నిరంతరమూ మాతాపితరుల సేవ చేస్తూ, గురురువులకు సమయానుసారముగా శుశ్రూషాది కార్యాలు నిర్వర్తించుచుండిరి అని ఈ శ్లోకము యొక్క భావము.