నవాగ్రయణపూజాభిరభ్యర్చ్య పితృదేవతాః । కృతాగ్రయణకాః కాలే సన్తో విగతకల్మషాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షోడశస్సర్గః (౬వ శ్లోకము)  హేమంత ఋతు వర్ణన చేస్తూ లక్ష్మణుడిట్లు శ్రీరామునితో పల్కెను: “సత్పురుషులు నవాగ్రయణపూజ ద్వారా పితృదేవతలను తృప్తి పరచి పాపరహితులగుచున్నారు”. క్రొత్తధాన్యం ఇంటికి వచ్చినప్పుడు, దానిని శాస్త్రోక్త పద్ధతిలో దేవ–పితృకార్యాలకు ప్రప్రథమముగా వినియోగించి (నవాగ్రయణాది ప్రక్రియలద్వారా), మిగిలిన ధాన్యనుము ప్రసాదముగా స్వీకరించుట సనాతన ధర్మమని ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. అట్లు నివేదనము చేయక తన తృప్తికై ధాన్యమును ఉపయోగించినచో, ఆ ధాన్యార్జనయందు జరిగే జీవహింసాపాపము యజమానికి అంటునని లక్ష్మణుడు మనకి బోధిస్తున్నాడు.

యథైషా రమతే రామ ఇహ సీతా తథా కురు । దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్ఛతీ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రయోదశస్సర్గః (౪వ శ్లోకము) భగవంతుడైన అగస్త్యుడు శ్రీరామునితో ఇట్లనెను: “శ్రీరామా! ఈ సీతాదేవి నిన్ను అనుగమించి అడవులకు రావడమన్న దుష్కరకార్యము సాధించి స్త్రీలోకానికే తలమాణికమైనది. ఇట్టి సాధ్విని సుఖపెట్టుట నీ కర్తవ్యను. ఆమెకేది ఇష్టమో అదే చేయి”. అనుకూలవతియైన భార్యను భర్త ఎంత ప్రేమానురాగములతో చూచుకోవాలో ఈ శ్లోకము ద్వారా అగస్త్యుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఇట్టి ఉన్నతాదర్శాలను బోధించే భారతీయతకు జేజేలు.

సదృశం చానురూపం చ కులస్య తవ చాత్మనః । సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యోపి గరీయసీ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే దశమస్సర్గః (౨౨వ శ్లోకము) తనకు హితవు చెప్పిన సీతను ప్రశంసిస్తూ శ్రీరాముడిట్లు పల్కెను: “ఓ జానకీ! నీవు నీ స్వభావమునకు, జనకునివంశమునకు, తగినట్టుగా సత్యములు పలికితివి. నీవు నాకు ప్రాణములకంటేను ప్రియమైనదానవి. నా సహధర్మచారిణివి అగునందున ఈ ధర్మాచరణములో నాతో పాలుపంచుకొనుము”. మనము నేర్వవలసిన నీతులు: తాను ఎంతటి ధార్మికుడైననూ, శిష్యస్థానములోనున్న సీతాదేవి హితవు చెప్పినప్పుడు శ్రీరాముడు ఆ హితవును వినుటయే కాక తిరిగి ఆమెను మెచ్చుకొనెను. శ్రీరామునికి తాను ధార్మికుడను అన్న అహము ఏ…

పరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతరమస్తి మే । పితుర్వియోగాత్ సౌమిత్రే! స్వరాజ్యహరణాత్ తథా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ద్వితీయస్సర్గః (౨౧వ శ్లోకము) విరాధుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయినప్పుడు తీవ్రమైనతాపమునకు శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను: “ఓ సౌమిత్రీ! నాకు రాజ్యాభిశేకము జరగనప్పుడు బాధకలుగలేదు. నాకు పితృవియోగమే అతిదారుణమైన దుఃఖము. దాటికంటే తీవ్రమైన బాధ నాకిప్పుడు జానకి యొక్క దుస్థితిచూసి కలుగుచున్నది”. భార్యపై భర్తకు ఉండవలసిన ప్రీతి ఈ శ్లోకము ద్వారా ఆవిశ్కరించినారు వాల్మీకిమహర్షి.

ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ నిషేవతామ్ । త్యక్తధర్మరతిర్మూఢో యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౫౨వ శ్లోకము)  శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి అధర్మమునకు నేను పాల్పడినట్టైతే, ధర్మార్థకామములయందు విడువను అని పెద్దలముందర బాస చేసి, ఆ మాటను వమ్ముచేసి ధర్మపత్నిని పరిత్యజించి, పరస్త్రీలను కామించే భష్టునికి పట్టే దుర్గతే నాకుకలుగుగాక”.

భర్తా తు ఖలు నారీణాం గుణవాన్ నిర్గుణోఽపి వా । ధర్మం విమృశమానానాం ప్రత్యక్షం దేవి! దైవతమ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్విషష్టితమస్సర్గః (౮) “నిర్గుణుడైనా, సగుణుడైనా, సతికి పతియే ప్రత్యక్ష దైవము”. ఇది స్త్రీజాతికి భగవంతుడిచ్చిన గొప్ప వరము. అట్లే పురుషజాతికిది కత్తిమీదసాము. ఏలన భగవంతుని వలె అపారమైన కరుణయు, అనుగ్రహము పతిస్థానమున యుండి చూపుట బహు కష్టము కదా.

వేదిస్థలవిధానాని చైత్యాన్యాయతనాని చ । ఆశ్రమస్యానురూపాణి స్థాపయామాస రాఘవః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షడ్పఞ్చాశస్సర్గః (౩౩) శ్రీరాముడు స్నానమాచరించి శుచియై శాస్త్రానుసారముగా వాస్తుపూజ, మరియు సర్వదేవతారాధన చేసి, సీతాలక్ష్మణులతో కలిసి క్రొత్తదైన పర్ణశాలలోకి ప్రవేశించెను. గృహప్రవేశము తరువాత మొట్టమొదటగా గణేశాది దేవతా చైత్యములను, విష్ణువు మొదలైన దేవతామందిరములును ఆ పర్ణశాలలో అనువైన ప్రదేశములలో నిర్మించిరి. ఆ మందిరములలో ఆయా దేవతలను శాస్త్రానుసారముగా ప్రతిష్ఠించిరి. వైస్వదేవబలి పీఠములను కూడా ప్రతిష్ఠించిరి. ఆ తరువాత అడవిలో లభించు వివిధములైన మంగళకరమైన వస్తువులను సేకరించి నిత్యమూ దేవతారాధన చేసిరి. సకల భూతములనూ తృప్తి పరచుచుండిరి. గార్హస్థ్యములో ముఖ్యమైన…

కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే! చిరజీవిభిః ॥ కర్తవ్యః శాస్త్రదృష్టో హి విధిర్ధర్మమనుస్మర ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షడ్పఞ్చాశస్సర్గః (౨౨-౨౩) క్రొత్తదైన పర్ణకుటీరములోనికి ప్రవేశించే ముందర శ్రీరాముడు లక్ష్మణునితోనిట్లనెను “నూతన గృహమును ప్రవేశించుముందర ఆయురాగ్యాభివృద్ధికై వాస్తుశాంతి శాస్త్రోక్తముగా చేయుట అవస్య కర్తవ్యము. ఇట్టి విధినిర్ణీతములైన అవస్య కర్తవ్యములను విస్మరించరాదు”.

యద్యత్ ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా । తత్తత్ ప్రదద్యా వైదేహ్యా యత్రాఽస్యా రమతే మనః ॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చపఞ్చాశస్సర్గః (౨౮) శ్రీరాముడు ఇట్లనెను “ఏ ఏ పూలు, పండ్లు సీతాదేవికి రుచించునో వాటివాటిని తప్పకతెచ్చి ఆమె మనసును రంజింపచేయవలెను”. అట్లే ఆమె సంరక్షణ విషయములో అప్రమత్తులమై ఉండవలెనని శ్రీరాముడు లక్ష్మణునితో చెప్పెను. భర్త యొక్క కర్తవ్యమును గుర్తుచేసి, భారతీయ సాంప్రదాయములో భార్యాభర్తలకున్న అన్యోన్యతను ప్రదర్శించే ఇట్టి శ్లోకములు చిరస్మరణీయములు.

ఆత్మా హి దారాః సర్వేషాం దారసఙ్గ్ర్రహవర్తినామ్ । ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీమ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తత్రింశస్సర్గః (౨౪) భార్యాభర్తల సంబంధమునకు నిర్వచనమిచ్చే ఈ వసిష్ఠోవాచమైన శ్లోకము చిరస్మరణీయము. “భర్తకు, భర్యకు అబేధము. కాబట్టి శ్రీరముని స్థానములో ఈ జానకీ దేవి మన రాజ్యమును పాలించదగును”.