రాాజ్యం పాలయితుం శక్యం న తీక్ష్ణేన నశాచర । న చాపి ప్రతికూలేన నాఽవినీతేన రాక్షస ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకచత్వాారింశస్సర్గః (౧౧వ శ్లోకము) “అతి తీవ్రముగా, నిరంకుశధోరణితో, వర్తించే రాజు; ప్రజలకు ప్రతికూలమైన రాజు; ఇంద్రియనిగ్రహము లేక అధార్మికుడైన రాాజు, రాజ్యము పాలించలేడు”. కాబట్టి సీతామాతను వంచిచి అపహరించే పాపపుకార్యమును విరమించుకోమని మారీచుడు రావణునికి బోధించెను.

రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర । తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపాః ॥

— శ్రీమద్వాల్మీకిరామయణే అరణ్యకాణ్డే ఏకచత్వారింశస్సర్గః (౧౦వ శ్లోకము) దుర్మార్గుడైన రావణునికి హితబోధ చేస్తూ  మారీచుడీ అమృతవాక్కులు పల్కెను: “ప్రజలయొక్క ధర్మాచరణమునకు, వారి శ్రేయస్సునకు, రాజే ఆలవాలము. కాబట్టి ఎట్టిపరిస్థితులలోనూ రాజు ధర్మమార్గములో సుస్థిరులై ఉండవలెను”.

పఞ్చ రూపాణి రాజానో ధారయన్త్యమితౌజసః । అగ్నేరిన్ద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ॥ ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దణ్డం ప్రసన్నతామ్ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే చత్వారింశస్సర్గః (౧౨,౧౩వ శ్లోకములు) రాజు పూజ్యుడన్న విషయమును వివరిస్తూ రావణుడు మారీచునితో ఇట్లనెను: “తేజస్సంపన్నులైన రాజులు ఐదు దివ్యలక్షణములు కలిగియుందురు: శాసనమున అగ్నివలె తీక్ష్ణస్వభావము, యుద్ధమున ఇంద్రునివలె పరాక్రమము, సత్పురుషులకు చంద్రునివలె ఆహ్లాదము కలిగించు స్వభావము, దుష్టులను దండిచుటలో యమునివలె సమవర్తిత్వము, ప్రజలను అనుగ్రహించుటలో వరుణుని వలె ప్రసన్నత్వము”. ఉత్తమ రాజునకు ఉండవలిసిన ఐదు ముఖ్యలక్షణములు ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నాయి.

అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేన్ద్రియః । కృతజ్ఞో ధర్మశీలశ్చ స రాజా తిష్ఠతే చిరమ్ ॥౨౦॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రయస్త్రింశస్సర్గః (౨౦వ శ్లోకము) “అనుక్షణము జాగరూకుడైయుండువాడు, పరిపాలనాది విషయములలో ఆరితేరినవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ధర్మస్వభావము కలవాడు, అయిన రాజు చిరకాలము ప్రభువుగానిలువగలడు”, అని రావణునికి హితవు పలికెను కపటురాలైన శూర్పనఖ.

క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనామ్ । ధనుషా కార్యమేతావత్ ఆర్తానాం అభిరక్షణమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౨౬వ శ్లోకము) హింసను పూర్తిగా త్యజించి, వనములలో నిరంతరము తపస్సు చేసుకునే సాధువులను మృగరాక్షసాదులనుండి తమ ప్రతాపము ఉపయోగించి రక్షించట క్షత్రియుల ధర్మము, అని శ్రీరామునితో సీతాదేవి వినయపూర్వకముగా చెప్పెను.

నైవమర్హథ మాం వక్తుం ఆజ్ఞాప్తోహం తపస్వినామ్ ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షష్ఠస్సర్గః (౨౨వ శ్లోకము) రాక్షసులబారినుండి కాపాడమని ప్రార్థించిన ఋషులతో శ్రీరాముడిట్లనెను: “ఓ మహాత్ములారా! మీరు నన్ను ఇట్లు ప్రార్థించుట ఏ మాత్రమూ తగదు. నేను తాపసుల ఆజ్ఞలను పాలింపవలసినదే”. తాను సామ్రాజ్యానికి రాజైకూడా శ్రీరాముడు ఎంతో వినయముతో వర్తించెను. ఇట్టి వినయమే మహాత్ములకు అలంకారము. ఋషుల తపస్సు, వారి ధర్మము కాపాడుట రాజు యొక్క కర్తవ్యమని శ్రీరాముని సందేశము.

న్యస్తదణ్డా వయం రాజన్ జితక్రోధా జితేన్ద్రియాః । రక్షితవ్యాస్త్వయా శశ్వత్ గర్భభూతాస్తపోధనాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ప్రథమోధ్యాయః (౨౦వ శ్లోకము) రాక్షసులబారినుండి తమను కాపాడే భారము శ్రీరామునిదే అని నివేదిస్తూ దండకారణ్యములోని ఋషులు ఈ అపూర్వశ్లోకమును పల్కిరి: “ఓ రామా! మేము ఆయుధములనన్నిటిని త్యజించితిమి (ఆత్మరక్షణకైకూడా హింసను చేయము!). తపస్సుకు పరమశత్రువైన క్రోధమును పూర్తిగావిడిచితిమి (కావున శాపవాక్కులు పల్కము). ఇంద్రియనిగ్రహము పాటించుచున్నాము. కావున గర్భస్థశిశువులను కాపాడుకొనురీతి మమ్ము నీవే కాపాడవలెను”. ఇక మనము నేర్వవలసిన నీతులు: ఆత్మరక్షణకైకూడా ఏమాత్రము హింసచేయని సాధువులను కాపాడుట రాజ ధర్మము. ఇట్టివారిని రక్షించుట భగవంతుడైన శ్రీరాముని…