పూర్ణే వర్షసహస్రే తు కాష్ఠభూతం మహామునిమ్ । విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాంతరమావిశత్ ॥

్– శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే పఞ్చషష్టితమస్సర్గః (౩) “మహర్షి” ఐన విశ్వామిత్రుడు బ్రహ్మాదేశానుసారము ఇంకనూ ఇంద్రియనిగ్రహముకై సాధన కొనసాగించి వేయిసంవత్సరములు ఘోరతపమాచరించెను. ఆతని నిష్ఠపరీక్షింపదలచిన దేవతలు రంభను ఆ మహర్షి కడకు పంపిరి. అతిలోకసుందరియైన రంభ యొక్క వయ్యారాలను చూసినా ఏ మాత్రమూ చలించలేదు విశ్వామిత్రుడు. కానీ తనను పరీక్షించుటకై వచ్చినదన్న కోపముతో ఆమెను శపించెను. శాపమిచ్చిన మరుక్షణమే కోపించుట అవివేకమని తలచి ఆమెకు శాపావశానమునుకూడా బోధించెను. కానీ, మహర్షి తను చేసిన ఈ స్వల్ప దోషముకు మిక్కిలి దుఃఖించెను. ఎంత ప్రయత్నించినా క్రోధము వశము కావుటలేదని పరితపించెను. ద్విగుణీకృతమైన పట్టుదలతో మరల…