తత్ర రాజా గుహో నామ రామస్యాఽఽత్మసమస్సఖా । నిషాదజాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుతః ॥

—  శ్రీమద్వాల్మీకిరామాయణే  అయోధ్యాకాణ్డే  పఞ్చాశస్సర్గః  (౩౨) శ్రీరామునకు బోయల  రాజైన  గుహుడు తనతో  సమానమైన  స్నేహితుడు,  అని  ఈ  శ్లోకార్థము. భారతీయుల  వర్ణవ్యవస్థ  (caste system) లోని  సామరస్య  భావాన్ని  నిరూపించే ఈ  శ్లోక ము చిరస్మరణీయము.

కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే । మన్యతే పరయా కీర్త్యా మహత్ సర్గఫలం తతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ప్రథమస్సర్గః (౧౬) వాల్మీకి మహర్షి చెప్పిన ఈ శ్లోకము ప్రకారము — “కులధర్మాలను బాగుగా పాటించేబుద్ధియున్న శ్రీరాముడు, తన కులధర్మమైన క్షాత్రధర్మమును మిక్కిలి ఉన్నతమైనదిగా భావించేవాడు. ఇట్లు కులధర్మాలను పాటించుట వలన శాశ్వతమైన కీర్తి, మరియు పరమపదము కూడా లభిస్తాయని నమ్మేవాడు”. కాబట్టి మనము నేర్వవలసిది: పారంపర్యముగా పాటించుచూ వచ్చే మన కులధర్మము మీద మనకు సదభిప్రాయము ఉండవలెను. శ్రీరామునివలె, మన కులమే మనకు మిక్కిలి ఉన్నతమని భావించ వలెను. ఇట్లు అందరూ భావించినచో హెచ్చుతగ్గులు…

న భూమ్యా కార్య మస్మాకం న హి శక్తాః స్మ పాలనే । రతాః స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే చతుర్దశస్సర్గః (౪౫) అశ్వమేధము, విశ్వజిత్ మొదలైన యజ్ఞములు నిర్వహించినవారు, యజ్ఞాంతములో తమకు ఉన్న సంపదనంతా దానము ఇచ్చివేయాలి! పుత్రప్రాప్తికై అశ్వమేధము చేసిన దశరథుడు శాస్త్రానుసారము `హోత’ అను ఋత్విజునకు తూర్పుదిక్కున ఉన్న తన యావత్ సామ్రాజ్యాన్ని దానమిచ్చెను. అట్లే `ఆధ్వర్యువునకు’ పడమరదిక్కు, `బ్రహ్మకు’ (ఋష్యశృంగునకు) దక్షిణదిక్కు, `ఉద్గాతకు’ ఉత్తరదిక్కున ఉన్న రాజ్యమును దానమిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణులు ధర్మోచితమైన ఈ శ్లోకమును చెప్పిరి: “ఓ ఉదారుడైన మహారాజా! మేము బ్రాహ్మణులము కావున మాకు ప్రీతికరమైన ది స్వాధ్యాయమొక్కటే (అనగా వేదశాస్త్ర అధ్యయనము, దాని అనుష్ఠానము, మరియు శిష్యులకు దానిని…

సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి సుసత్కృతాః । న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే త్రయోదశస్సర్గః (౧౩) కులగురువు మరియు పధానపురోహితుడు అయిన వసిష్ఠులవారికి అభివాదనము, యథోచిత పూజ నిర్వహించి పుత్రకామేష్టియాగము సాంగముగా జరిపించమని ప్రార్థించినాడు దశరథుడు. దానికి అంగీకరించి వసిష్ఠుడు యజ్ఞకార్యములలో సహకరించే అందరిని పిలిపించి ఎన్నో జాగ్రత్తలు చెప్పెను. వాటిలో భాగముగా “బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మెదలైన నాలుగు వర్ణాలవారిని ఆహ్వానించండి. వారందరినీ  తగువిధముగా సత్కరించి ఆదరించండి. కామక్రోధాదులకు లోనై ఎవ్వరినీ పరబాటునకూడా చిన్నబుచ్చరాదు” అని ఆదేశించెను. భారతీయులలో సమానభావాలులేవని, సామాజికముగా హీనవర్గాలు ఉన్నాయనీ ఆరోపించే ధూర్తులకు ఈ శ్లోకము కనువిప్పుకావాలి. ఆకాలములోని అయోధ్యా వర్ణనముచేస్తూ…

నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ । పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా ॥

— వాల్మీకిరామాయణే బాలకాణ్డే పఞ్చవింశస్సర్గః (౧౮) లోకహింసాపరాయణి అయిన తాటకిని వధించమని ఆజ్ఞాపిస్తూ విశ్వామిత్రులవారు శ్రీరామునికి చేసిన బోధ ఇది: “ప్రజారక్షణార్థము ఒక పాపపుకృత్యమో లేక ఒక హింసాకృత్యమో చేయుట అనివార్యమైతే ఆ దోషభూయిష్టమైన పనిని క్షత్రియుడైనవాడు తప్పనిసరిగా చేసి ప్రజలను కాపాడవలసినదే. ఏలన క్షత్రియునకు ప్రజలను రక్షించడమే పరమ కర్తవ్యము”. ఇంకనూ విశ్వామిత్రుడు, చాతుర్వర్ణములవారిని రక్షించుట రాజుయొక్క కర్తవ్యమని హితవు పల్కెను. తను చెప్పిన ఈ శ్లోకమును నిరూపించు రెండు ఉదాహరణలను కూడా ఇచ్చెను: 1) పూర్వము విరోచనుని కూతురైన…