ద్విజాతివేషేణ సమీక్ష్య మైథిలీ సమాగతం పాత్రకుసుమ్భధారిణమ్ । అశక్యముద్వేష్టుమపాయదర్శనం న్యమన్త్రయద్బ్రాహ్మణవత్ తదాఙ్గనా ॥

— శ్రీమద్వాల్మీకి రామాయణే అరణ్యకాణ్డే షట్చత్వారింశస్సర్గః (౩౪వ శ్లోకము) కపట సన్యాసి వేషము వేసినా, సీతమ్మను చూచిన తరువాత ఆమె అందముతో మత్తెక్కిన రావణుడు తన కామోద్రేకమును ఆపుకోలేక తన దుర్బుద్ధిని బయట పెడుతూ సీతమ్మ అందచందాలను అసభ్యముగా వర్ణిస్తాడు రావణుడు. “అప్పుడు ఆ కపట సన్న్యాసిని తేరిపారచూచి, వచ్చినవాడు దుర్బుద్ధికలవాడని తెలిసినా, వాడు పూజ్యుడైన సన్యాసి వేషములో, పైగా అతిథియై, వచ్చినందుకు నిరాదరణ చేయలేక, యథావిధిగా అర్ఘ్యపాద్యాదులిచ్చినది సీతాదేవి” అని ఈ శ్లోక భావము. ఈ…

కచ్చిదర్థేన వా ధర్మం అర్థం ధర్మేణ వా పునః । ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే ॥

— వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే శతతమస్సర్గః (౬౩) గృహస్థాశ్రమములోని వారికి పురుషార్థముల ప్రధాన్యతను వివరించే ఈ అద్భుత శ్లోకమును శ్రీరాముడు భరతునకు చెప్పెను: కోరికలు మరియు ధనార్జనమార్గము రెండూ ధర్మబద్ధములై ఉండాలని శ్రీరామాజ్ఞ. ఏలన, “ధరతి విశ్వం ధర్మః”, ధర్మము ఈ విశ్వానికే ఆధారము కావున ధర్మాన్ని ఎన్నడూ వీడరాదు. గృహస్థుడు ఎన్నడూ అర్థమును త్యజించరాదని అతని తీర్పు. ఎందుకంటే గృహస్థుకు తన సంసారమును, ఇతర ఆశ్రమములలో ఉండువారిని (బ్రహ్మచారులను, సన్యాసులను), అతిథులను, తనతోటి పశుపక్షాదులను, చెట్లను పోషించే బాధ్యత ఉన్నది. దీనికై ధనము అవసరమే కదా! చివరగా ధర్మకార్యాలను…

పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి నః | యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||

— వాల్మీకిరామాయణే బాలకాణ్డే ద్వాత్రింశస్సర్గః (౨౨) రూపయవ్వనవతులైన కుశనాభుని కుమార్తెలు ఏకాంతములో ఉన్నప్పుడు వారిని మోహించిన వాయువు తనని పెండ్లి ఆడమని వారిని అర్థిస్తాడు. తన భార్యలైతే వారికి అమరత్వము మఱియు నిత్యయవ్వనము లభిస్తాయని ప్రలోభపెడతాడు. కానీ వారు ప్రలోభపడక, సర్వాత్మకుడైన వాయువునకు ఇలా హితవుపలుకుతారు. వరనిర్ణయాధికారము తమకులేదని, ఆ అధికారము కేవలము సత్యవాదియైన తమ తండ్రిగారిదే అని తేల్చిచెప్పేస్తారు. తమ పాలిట పరమదైవమైన తండ్రిగారు నిర్ణయించిన వానినే భర్తగా స్వీకరిస్తామని అంటారు. అందుకని ఇట్టి దురాలోచన…