పాద్యమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహితా । ప్రతిజగ్రాహ కాకుత్స్థో విధిదృష్టేన కర్మణా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకోనపఞ్చాశస్సర్గః (౧౮) “అహల్యాదేవి శ్రీరామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాదులిచ్చి, తగురీతిలో ఆతిథ్యమిచ్చెను. ఇది కేవలము విధివశాత్ జరుగుతున్న సత్కారమని భావించి వారుకూడా ఆ ఆతిథ్యమును స్వీకరించిరి”, అని ఈ శ్లోకమునకు అర్థము. “అతిథి దేవో భవ” అన్న సూత్రానికి భాష్యముగా నిలిచే ఈ శ్లోకము చిరస్మరణీయము. ఇంటికి వచ్చిన అతిథిని సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి ఆయనకు పాద్యము (కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవలెను), అర్ఘ్యము (చేతులు కడుగుకోవటానికి నీళ్ళు ఇచ్చి), ఆచమనము చేయుటకు శుద్ధజలము ఇచ్చి, ఇంటిలోనికి ఆహ్వానించి, తగురీతిలో అతిథిని…