యస్త్విహ వై నిజవేదపథాదనాపద్యపగతః పాషణ్డం చోపగతస్తమసిపత్రవనమ్ ప్రవేశ్య …

“యస్త్విహ వై నిజవేదపథాదనాపద్యపగతః పాషణ్డం చోపగతస్తమసిపత్రవనమ్ ప్రవేశ్య కశయాప్రహరన్తి తత్రః అసౌ ఇతస్తతో ధావమాన ఉభయతోధారైస్తాలవనాసిపత్రైశ్ఛిద్యమానసర్వాఙ్గో హా హతోఽస్మీతి పరమయా వేదనయా మూర్ఛితః పదే పదే నిపతతి స్వధర్మః పాషణ్డానుగతం ఫలం భుఙ్క్తే ” — శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పఞ్చమస్కన్ధే షడ్వింశోఽధ్యాయః (౧౫ వ శ్లోకము) ఏ విధమనైక సంకట స్థితి ఏర్పడకున్ననూ వేదవిహితమైన మార్గమును వీడి ఇతర పాషండ మతములను ఆశ్రయించిన జీవుని యమదూతలు అసిపత్ర వనము అను నరకమునకు కోనిపోయి, కొరడలతో…

ధర్మాయ యశసేఽర్థాయ కామాయ స్వజనాయచ । పఞ్చధా విభజన్ విత్తం ఇహాముత్రచ శోభతే ॥

శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కన్ధే ఏకోనవింశోఽధ్యాయః (౩౭) శుక్రాచార్యులవారు ధనమును క్రమ పద్ధతిలో ఖర్చుపెట్టే పద్ధతిని బలిచక్రవర్తికి వివరిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు: “ఈ క్రింది ఐదు అంశాలకు నష్టము కలుగకుండా ధనమును విభజించి ఖర్చుపెట్టినవాడే ఇహపరసాధన చేయగలడు: ధర్మకార్యాలు కీర్తి ధర్మబద్ధమైన అర్థార్జన ధర్మబద్ధమైన కోరికలు స్వజనుల పురుషార్థములు” ఈ సూత్రమును పాటించగలితే నిజముగా మనము ధన్యులమే అవుతాము.