మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయన్త్ర్రితః । గురూణాం గురుకార్యాణి కాలే కాలేఽన్వవైక్షత ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే సప్తసప్తీతితమస్సర్గః (౨౫) రామలక్ష్మణులు నిరంతరమూ మాతాపితరుల సేవ చేస్తూ, గురురువులకు సమయానుసారముగా శుశ్రూషాది కార్యాలు నిర్వర్తించుచుండిరి అని ఈ శ్లోకము యొక్క భావము.

ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా । యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్ ॥

– శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకోనసప్తతితమస్సర్గః (౧౪) శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల వివాహ విషయములో రాజర్షి అయిన జనక మహారాజు యజ్ఞము పూర్తి అయిన పిదప ఋషి సమ్మతమైన వివాహము నెరవేర్పుము అని దశరథుని అర్థించెను. దానికి, మాటలలో నేర్పరి, సమర్థుడు అయిన దశరథ మహారాజు పైన చెప్పిన రీతిలో ఈవిధముగా బదులు ఇచ్చెను: “ధర్మములు తెలిసిన మహారాజా! ప్రతిగ్రహమనునది దాత చేతిలోనే వున్నది. దాత ఇచ్చినపుడే ప్రతిగ్రహీత ప్రతిగ్రహించునది. నీ కన్యాదాననిర్ణయాదికమును విని యున్నాము. నీవు…

దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్ । అభివాద్యాభివాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే సప్తసప్తతితమస్సర్గః (౧౩-౧౪) శాస్త్రోక్త పద్ధతిలో సమంత్రకముగా సీతారాముల కళ్యాణము కన్నుపండుగగా జరిగినది. మహారాణులైన  కౌసల్యా, సుమిత్రా మరియు కైకేయి, నూతన వధువులైన సీతా, ఊర్మిళా, మాండవీ, శ్రుతకీర్తులను ప్రేమతో ఆహ్వానించి వారిని తగు భోగవస్తువులతో సత్కరించిరి. వాల్మీకిమహర్షి చెప్పిన ఈ శ్లోకము ప్రకారము “ఆ తరువాత ఆ వధువులు చక్కగా అలంకారముచేసుకొని, పండితులు స్వస్తివచనాలు పలుకుచుండగా, పూజాగృహములోకి ప్రవేశించి, కులదేవతలను శ్రద్ధగా పూజించిరి. ఆ రాజకుమార్తెలు పెద్దలైన వారందరికీ వినయముగా అభివాదనము చేసిరి”. తరువాత…

రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ । పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే ఏకసప్తతితమస్సర్గః (౨౨-౨౩) రామలక్ష్మణుల యొక్క శౌర్యప్రతాపాలను స్వయముగా దర్శించి, ఇక్ష్వాకువంశము యొక్క కీర్తిచంద్రికలను యెరిగిన జనకుడు తన కుమార్తెలైన సీతా ఊర్మిళలకు రామలక్ష్మణులే తగినవారని నిర్ణయించి, దశరథుని తగువిధముగా ఆహ్వానించెను. అట్లే జనకమహారాజు యొక్క ధర్మనిరతిని, శీలవైభవమును స్మరించి, ఇది తగిన సంబంధమని భావించిరి దశరథుడు మరియు ఆతని గుర్వమాత్యులు. వివాహముహూర్త నిర్ణయము, ఇరు వంశాల ప్రవరకీర్తనము జరిగినతరువాత రాజర్షియైన జనకుడు ఈ ధర్మోక్తమైన శ్లోకమును చెప్పెను “ఓ దశరథమహారాజా! రామలక్ష్మణులకు శాస్త్రోక్తముగా గోదాన…

తస్మై దత్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః । నిశ్శేషితేన్నే భగవాన్ అభుక్త్వైవ మహాతపాః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే పఞ్చషష్టితమస్సర్గః (౬) ౧౦౦౦ సంవత్సరాలపాటు అన్నపానాదులను, ఉచ్ఛ్వాసాదులను కూడా బిగబట్టి చేసిన కఠోరమైన దీక్ష పరిసమాప్తియైన పిమ్మట, దీక్ష విరమించుటకై భోజనము చేయడానికి సంకల్పించెను విశ్వామిత్రులవారు. శాస్త్రోక్త పద్ధతిలో అన్నమును వండుకొని, భగవంతుని సమర్పించి దాన్ని సిద్ధాన్నముగా జేసికొని దాన్ని తినడానికి ఉపక్రమించబోతున్న సమయములో దేవేంద్రుడు ఆయనని పరీక్షించుటకై ఒక బ్రాహ్మణుగా వచ్చి తనకు అన్నము పెట్టమని అర్థించెను. శతానందులవారు చెప్పిన ఈ శ్లోకము ప్రకారము “అప్పుడు విశ్వామిత్రమహర్షి సిద్ధాన్నమంతటిని ఆ బ్రాహ్మణునకు సమర్పించెను. తృప్తిగా ఆ…

పూర్ణే వర్షసహస్రే తు కాష్ఠభూతం మహామునిమ్ । విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాంతరమావిశత్ ॥

్– శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే పఞ్చషష్టితమస్సర్గః (౩) “మహర్షి” ఐన విశ్వామిత్రుడు బ్రహ్మాదేశానుసారము ఇంకనూ ఇంద్రియనిగ్రహముకై సాధన కొనసాగించి వేయిసంవత్సరములు ఘోరతపమాచరించెను. ఆతని నిష్ఠపరీక్షింపదలచిన దేవతలు రంభను ఆ మహర్షి కడకు పంపిరి. అతిలోకసుందరియైన రంభ యొక్క వయ్యారాలను చూసినా ఏ మాత్రమూ చలించలేదు విశ్వామిత్రుడు. కానీ తనను పరీక్షించుటకై వచ్చినదన్న కోపముతో ఆమెను శపించెను. శాపమిచ్చిన మరుక్షణమే కోపించుట అవివేకమని తలచి ఆమెకు శాపావశానమునుకూడా బోధించెను. కానీ, మహర్షి తను చేసిన ఈ స్వల్ప దోషముకు మిక్కిలి దుఃఖించెను. ఎంత ప్రయత్నించినా క్రోధము వశము కావుటలేదని పరితపించెను. ద్విగుణీకృతమైన పట్టుదలతో మరల…

బ్రహ్మణస్స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ । న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే త్రిషష్టితమస్సర్గః (౧౯) విశ్వామిత్రుడు ఒక ధార్మికమైన మహారాజుగా సాధనమొదలు పెట్టి, తీవ్రమైన తపస్సుచే క్రమముగా ధనుర్వేదమంతయూ ఔపాసన పట్టి, రాజర్షియై, తరువాత మహర్షి అయ్యెను. పిదప ఆయన కౌశికీనదీ తీరమున ఇంద్రియనిగ్రహమునకై వెయ్యేండ్లు ఘోరతపమాచరించెను. ఆ తపస్సుకు మెచ్చి దేవతలతో కలిసి లోకేశ్వరుడైన బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి “నీవు ఋషులలోకెల్లా శ్రేష్ఠుడవు కావున, నీకు మహర్షిత్వమును ఒసంగుతున్నాను”, అని వరమిచ్చెను. ఆ వచనములను వినిన విశ్వామిత్రులవారు పొంగిపోలేదు అలాగని క్రుంగిపోలేదు, అని శతానందమహర్షి ఈ శ్లోకముద్వారా రామలక్ష్మణులకు విశ్వామిత్రుని మాహాత్మ్యమును…