తప్తకాఞ్చనపుష్పాం చ వైడూర్యప్రవరచ్ఛదామ్ । ద్రక్ష్యసే శాల్మలీం తీక్ష్ణాం ఆయసైః కణ్టకైశ్చితామ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః (౨౦వ శ్లోకము) రావనుని హెచ్చరిస్తూ, పరస్త్రీని కామించే ధూర్తుడు పొందే నరకయాతనను ఇలా వివరించినది సీతామాత: “ఓ రావణా! వేడికి ఎర్రగా కాగిన బంగారు పూలు కలదియు, అంతే వేడెక్కిన మణులతో పొదగ బడిన ఆకులు కలదియు, మొనదేలిన ఇనుపముళ్ళు కలదియు అయిన బూరుగుచెట్టు ఆకారపు స్తంభములను కౌగిలించెదవు  (కావున జాగ్రత్త)”.

నదీం వైతరణీం ఘోరాం రుధిరౌఘనివాహినీమ్ । అసిపత్ర వనం చైవ భీమం పశ్యసి రావణ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః (౧౯వ శ్లోకము) రావనుని హెచ్చరిస్తూ, పరస్త్రీని కామించే ధూర్తుడు పొందే నరకయాతనను ఇలా వివరించినది సీతామాత: “ఓ రావణా! రక్తప్రవాహముతో, అతిదారుణముగా ఉండే వైతరలో పడిపోయెదవు. పదునైన కత్తులే ఆకులుగా ఉండే భయంకరమైన అడవిలో తిరుగాడెదవు (కావున జాగ్రత్త)”.

క్రోశన్తీం రామరామేతి రామేణ రహితాం వనే । జీవితాన్తాయ కేశేషు జగ్రాహాన్తకసన్నిభః ॥

— శ్రీవాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ద్విపఞ్చాశస్సర్గః (౧౦వ శ్లోకము) కొన ఊపిరితో కొట్టుకుంటున్న తండ్రివంటి జటాయువున పదేపదే అక్కున చేర్చుకుని ఏడువ సాగెను దీనురాలైన సీతాదేవి. ఆమె దుస్స్థిని చూచి కూడా జాలపడక, ఆమెను ఎత్తుకు పోవడాని దగ్గరకు వచ్చెను క్రూరుడైన రావణుడు. అప్పుడు “హా రామా! హా రామా! అని బిగ్గరగా ఏడుస్తూ ఉన్న ఒంటరి సీతను, చావు దగ్గర పడ్డ రావణుడు జుట్టు పట్టుకొని ఈడ్చ సాగెను”. స్త్రీ సదా పూజ్యురాలు. అందునా పతివ్రతయైన స్త్రీ…

పరేతకాలే పురుషో యత్ కర్మ ప్రతిపద్యతే ।వినాశాయాత్మనోఽధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ తత్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకపఞ్చాశస్సర్గః (౩౧వ శ్లోకము) “కాలం దగ్గర పడిన పురుషుడు, ఆత్మనాశకరమైన అధర్మకార్యములే చేయును” అని జటాయువు రావణుని హెచ్చరించెను. కాబట్టి సీతాపహరణమను దుష్కార్యమును విడిచి బాగుపడమని బోధించెను.

అనుబన్ధం అజానన్తః కర్మణాం అవిచక్షణాః ।శీఘ్రమేవ వినశ్యన్తి యథా త్వం వినశిష్యసి ॥

— శ్రీమద్వాల్మీకిరామయణే అరణ్యకాణ్డే ఏకపఞ్చాశస్సర్గః (౨౬వ శ్లోకము) “ధర్మాధర్మ విచక్షణ సేయక, విచ్చలవిడిగా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే అజ్ఞానులు నీ వలెనే శీఘ్రముగా నాశనమవుతారు”, అని రావనుని హెచ్చరించాడు జటాయువు. ఈ హెచ్చరిక మనకు చేసినట్టుగా భావించి, ధర్మమార్గమును ఎల్లప్పుడూ అనుసరించే ప్రయత్నము చేద్దాము!

స రాక్షసరథే పశ్యన్ జానకీం బాష్పలోచనామ్ ।అచిన్తయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవత్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకపఞ్చాశస్సర్గః (౧౦వ శ్లోకము) సీతామాతను ఎత్తుకొని పోతున్న రావణునితో జటాయువు భీషణ యుద్ధము చేసెను. రావణుని తీవ్రమైన బాణాలధాటికి జటాయువు శరీరము శిథిలమయ్యెను. బాణపు దేబ్బలతో వేదన పడుతున్న జటాయువు “అప్పుడు రావాణుని రథములో కంటతడి పెట్టుకున్న సీతామాత దీనస్థితిన గమనించెను. (ఆమెను అట్లా చూడలేక) తన శరీరములో గుచ్చుకున్న బాణాలను సైతం లెక్కసేయక, ఆ రక్కసి పై (మరల) మెరుపు దాడి చేసెను”. రావణుని ధనుస్సును, రథాశ్వములను, రథసారథిని, రథమును ధ్వంసముచేసెను.…

యథాత్మనస్తథాన్యేషాం దారా రక్ష్యా విపశ్చితా॥ అర్థంవా యదివా కామం శిష్టాః శాస్త్రేష్వనాగతమ్ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాశస్సర్గః (౭-౮వ శ్లోకములు) సీతమ్మను చెరపట్టడం భయంకరమైన పాపకార్యమని హెచ్చరిస్తూ రావణాసురుడికి ఈ నీతి వాక్యాలు బోధించాడు జటాయువు: “ఎట్లాగైతే నీ భార్యను పరులనుండి కాపాడుతావో, అట్లే పరభార్యను కూడా కాపాడాలి. తెలివైనవారు అర్థకామాల విషయములో శాస్త్రవాక్కునే అనుసరిస్తారు”. పరస్త్రీలను కాపాడుట ప్రతి పురుషుని కనీస కర్తవ్యమని బోధించిన జటాయువే మనకు పరమగురువు.

దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ సత్యం బ్రూయాన్న చానృతమ్ । ఏతద్బ్రాహ్మణ! రామస్య ధ్రువం వ్రతమనుత్తమమ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే సప్తచత్వారింశస్సర్గః (౧౭వ శ్లోకము) శ్రీరాముని గుణాలలు వర్ణిస్తూ సీతాదేవి “ఒకరికి ఇచ్చినది తిరిగి స్వీకరించకుండుట, నిజాలే తప్ప అబద్ధాలు పల్కకుండుట, ఇవి రాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పని నియమాలు” అని ఈ శ్లోకము ద్వారా చెప్పినది.

ద్విజాతివేషేణ సమీక్ష్య మైథిలీ సమాగతం పాత్రకుసుమ్భధారిణమ్ । అశక్యముద్వేష్టుమపాయదర్శనం న్యమన్త్రయద్బ్రాహ్మణవత్ తదాఙ్గనా ॥

— శ్రీమద్వాల్మీకి రామాయణే అరణ్యకాణ్డే షట్చత్వారింశస్సర్గః (౩౪వ శ్లోకము) కపట సన్యాసి వేషము వేసినా, సీతమ్మను చూచిన తరువాత ఆమె అందముతో మత్తెక్కిన రావణుడు తన కామోద్రేకమును ఆపుకోలేక తన దుర్బుద్ధిని బయట పెడుతూ సీతమ్మ అందచందాలను అసభ్యముగా వర్ణిస్తాడు రావణుడు. “అప్పుడు ఆ కపట సన్న్యాసిని తేరిపారచూచి, వచ్చినవాడు దుర్బుద్ధికలవాడని తెలిసినా, వాడు పూజ్యుడైన సన్యాసి వేషములో, పైగా అతిథియై, వచ్చినందుకు నిరాదరణ చేయలేక, యథావిధిగా అర్ఘ్యపాద్యాదులిచ్చినది సీతాదేవి” అని ఈ శ్లోక భావము. ఈ…

రాాజ్యం పాలయితుం శక్యం న తీక్ష్ణేన నశాచర । న చాపి ప్రతికూలేన నాఽవినీతేన రాక్షస ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకచత్వాారింశస్సర్గః (౧౧వ శ్లోకము) “అతి తీవ్రముగా, నిరంకుశధోరణితో, వర్తించే రాజు; ప్రజలకు ప్రతికూలమైన రాజు; ఇంద్రియనిగ్రహము లేక అధార్మికుడైన రాాజు, రాజ్యము పాలించలేడు”. కాబట్టి సీతామాతను వంచిచి అపహరించే పాపపుకార్యమును విరమించుకోమని మారీచుడు రావణునికి బోధించెను.