సుఖస్య దుఃఖస్య న కోఽపి దాతా పరో దదాతీతి కుబుద్ధి రేషా । అహం కరోమితి వృథాభిమానః స్వకర్మసూత్రగ్రథితో హి లోకః ॥

— శ్రీమద్వ్యాసవిరచిత అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వరసంవాదే అయోధ్యాకాణ్డే షష్ఠమస్సర్గః (౬) సీతారాములు గడ్డిపరకలపై నిదురించుట చూడలేక దుఃఖాతిశయముతో గుహుడు కైకేయిని నిందించెను. అప్పుడు సనాతన ధర్మానికి మూలమైన ఈ శ్లోకము పరమ ఉపాసనాస్వరూపుడైన లక్ష్మణమూర్తి గుహునకు వివరించెను. “మనకు కలిగే సుఖదుఃఖములను మనకి ఇచ్చువారు ఎవరూలేరు. ఎవరి వల్లలో మనమివి అనుభవిస్తున్నాము అని అనుకోవడం మూర్ఖత్వము. ఒకరికి ఏదో సహాయముచేసి వారిని సుఖపెట్టామని అనుకునేవాడు దురహంకారి అని చెప్పవచ్చు. ద్వేషభావముతో ఇతరులకు కీడుతలపెట్టి వారిని దుఃఖపరచుట కూడా దురహంకారమే. ఎందుకంటే ప్రాణులకు వారు చేసిన సుకృత…