యథాత్మనస్తథాన్యేషాం దారా రక్ష్యా విపశ్చితా॥ అర్థంవా యదివా కామం శిష్టాః శాస్త్రేష్వనాగతమ్ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాశస్సర్గః (౭-౮వ శ్లోకములు)

సీతమ్మను చెరపట్టడం భయంకరమైన పాపకార్యమని హెచ్చరిస్తూ రావణాసురుడికి ఈ నీతి వాక్యాలు బోధించాడు జటాయువు: “ఎట్లాగైతే నీ భార్యను పరులనుండి కాపాడుతావో, అట్లే పరభార్యను కూడా కాపాడాలి. తెలివైనవారు అర్థకామాల విషయములో శాస్త్రవాక్కునే అనుసరిస్తారు”.

పరస్త్రీలను కాపాడుట ప్రతి పురుషుని కనీస కర్తవ్యమని బోధించిన జటాయువే మనకు పరమగురువు.