యస్త్విహ వై నిజవేదపథాదనాపద్యపగతః పాషణ్డం చోపగతస్తమసిపత్రవనమ్ ప్రవేశ్య …

“యస్త్విహ వై నిజవేదపథాదనాపద్యపగతః పాషణ్డం చోపగతస్తమసిపత్రవనమ్ ప్రవేశ్య కశయాప్రహరన్తి తత్రః అసౌ ఇతస్తతో ధావమాన ఉభయతోధారైస్తాలవనాసిపత్రైశ్ఛిద్యమానసర్వాఙ్గో హా హతోఽస్మీతి పరమయా వేదనయా మూర్ఛితః పదే పదే నిపతతి స్వధర్మః పాషణ్డానుగతం ఫలం భుఙ్క్తే ”

— శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పఞ్చమస్కన్ధే షడ్వింశోఽధ్యాయః (౧౫ వ శ్లోకము)

ఏ విధమనైక సంకట స్థితి ఏర్పడకున్ననూ వేదవిహితమైన మార్గమును వీడి ఇతర పాషండ మతములను ఆశ్రయించిన జీవుని యమదూతలు అసిపత్ర వనము అను నరకమునకు కోనిపోయి, కొరడలతో కొట్టుదురు. ఆ దెబ్బలనుండి తప్పిచు కొనుటకై అతడు ఇటునటు పరిగెట్టును. అప్పుడు అతని దేహమును ఆ తాలవనమునందలి కత్తులవలె ఉన్న ఆకులు చీల్చివేయును. ఆ ఆకులు రెండువైపులా పదునుకలిగి ఉండును. “అయ్యో! చచ్చితిని” అని అరచుచూ అతడు అడుగడుగునా మూర్ఛితుడై పడిపోవును.

స్వధర్మనుమును వీడి పాషండ మతమును అనుసరించువాడు తన దుష్కర్మల ఫలమును ఇట్లు అనుభవించవలసి వచ్చును.

Advertisements