పఞ్చ రూపాణి రాజానో ధారయన్త్యమితౌజసః । అగ్నేరిన్ద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ॥ ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దణ్డం ప్రసన్నతామ్ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే చత్వారింశస్సర్గః (౧౨,౧౩వ శ్లోకములు)

రాజు పూజ్యుడన్న విషయమును వివరిస్తూ రావణుడు మారీచునితో ఇట్లనెను: “తేజస్సంపన్నులైన రాజులు ఐదు దివ్యలక్షణములు కలిగియుందురు: శాసనమున అగ్నివలె తీక్ష్ణస్వభావము, యుద్ధమున ఇంద్రునివలె పరాక్రమము, సత్పురుషులకు చంద్రునివలె ఆహ్లాదము కలిగించు స్వభావము, దుష్టులను దండిచుటలో యమునివలె సమవర్తిత్వము, ప్రజలను అనుగ్రహించుటలో వరుణుని వలె ప్రసన్నత్వము”.

ఉత్తమ రాజునకు ఉండవలిసిన ఐదు ముఖ్యలక్షణములు ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నాయి.

Advertisements