సులభాః పురుషా రజన్! సతతం ప్రియవాదినః । అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ॥

— శ్రీమద్వాల్మీకిరామయణే అరణ్యకాణ్డే సప్తత్రింశస్సర్గః (౨వ శ్లోకము)

“ఓ రాజా! యజమాని యొక్క హితాహితములు పట్టించుకొనక, స్వలాభముకై ఇచ్చకపుమాటలాడేవారే చాలమంది ఉంటారు. కానీ తాత్కాలికముగా అప్రియమైనాసరే దీర్ఘకాల క్షేమంకరములైన ధర్మోపదేశములు ఇచ్చేవారు దొరకరు. దొరికినా వినేవారూ దొరకరు”, అని మారీచుడు రావణునితో పల్కెను.

కాబట్టి, మనము ఎల్లప్పుడూ మనకి వత్తాసు పలికే వారితో కాక, ధర్మబుద్ధి కలవారితోనే మెలగాలి. రుచించకపోయినా, వారుచెప్పే ధర్మబోధనలను అనుసరించి జీవనము సాగించే ప్రయత్నము చేయాలి.

Advertisements