రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః । రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే సప్తత్రింశస్సర్గః (౧౩వ శ్లోకము)

శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకములో నిర్వచనము ఇచ్చాడు మహానుభావుడైన మారీచుడు: “శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమమునకు తిరుగులేదు. దేవేంద్రుడు దేవతకు ప్రభువైనట్టే, ఈ సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ రాముడు”.

అట్టి శ్రీరాముడు మనకి ఆదర్శము, ఆరాధ్యము కావాలి.

Advertisements