లోభాత్ పాపాని కుర్వాణః కామాద్వా యో న బుధ్యతే । భ్రష్టః పశ్యతి తస్యాన్తం బ్రాహ్మణీ కరకాదివ ॥౫॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకోనత్రింశ్శస్సర్గః (౫వ శ్లోకము)

దేవతలకు కూడా జయింపరాని ఖరదూషణాదులను, వారి ౧౪౦౦౦ సేనలను, శ్రీరాముడొక్కడే క్రోద్ది వ్యవధిలోనే సంహరించెను. ఆ సందర్భములో చివరిగా ఖరునకు హితవు పలుకుతూ శ్రీరాముడీ శ్లోకము చెప్ఫెను:

“కామముతోగానీ, లోభముచేగానీ దుష్కృత్యములు చేసి, మీదుమిక్కిలి పశ్చాత్తాపముకూడా చెందక ఉండే భ్రష్టులు, ఎట్లైతే నలికండ్లపాము వడగళ్ళను తానే మ్రింగి తాను మరణించునో, అట్లే దారుణ దుస్సహ దుర్గతులను తామే కోరికోరి పొందెదరు”.

కావున ఇంద్రియనిగ్రహముతో శ్రాస్త్రవిహిత కర్మాచరణ చేయుటే ఇహపర శ్రేయోదాయకము అని శ్రీరామచంద్రప్రభు సందేశము.

One thought on “లోభాత్ పాపాని కుర్వాణః కామాద్వా యో న బుధ్యతే । భ్రష్టః పశ్యతి తస్యాన్తం బ్రాహ్మణీ కరకాదివ ॥౫॥

  1. Pingback: న చిరం పాపకర్మాణః క్రూరా లోకజుగుప్సితాః । ఐశ్వర్యం ప్రాప్య తిష్ఠన్తి శీర్ణమూలా ఇవ ద్రుమాః ॥౭॥

Comments are closed.