న చిరం పాపకర్మాణః క్రూరా లోకజుగుప్సితాః । ఐశ్వర్యం ప్రాప్య తిష్ఠన్తి శీర్ణమూలా ఇవ ద్రుమాః ॥౭॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకోనత్రింశస్సర్గః (౬వ శ్లోకము)

ఖరునికి హితవు పలుకుతూ, శ్రీరాముడీ శ్లోకము చెప్పెను:

“పాపకర్మలను చేసే క్రూరులను లోకము అసహ్యించుకొనును. వ్రేళ్ళకు చీడపడితే మహావృక్షము సైతము క్రమముగా నిలువెల్లా ఎండిపోవును. అట్లే (ప్రారబ్ధబలముచే) దుష్టునికి మహైశ్వర్యము ప్రాప్తించినా అది అతని అధర్మవర్తనము వలన త్వరలోనే నశించును”.

ఈ శ్లోకము ద్వారా “మనిషి పురోగతికి ధర్మమే మూలమని” మనకి చెప్పకనే చెపుతున్నాడు శ్రీరాముడు.

Advertisements