అనాగతవిధానం తు కర్తవ్యం శుభమిచ్ఛతా । ఆపదం శఙ్కమానేన పురుషేణ విపశ్చితా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే చతుర్వింశ్శస్సర్గః (౧౧వ శ్లోకము)

దుశ్శకునములను గమనించిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను: “శుభములను కోరుకొనెడి దూరదర్శి తనకెదురగు ఆపదలను ఊహించి, రాబోవు అనర్థములకు తగిన ప్రతిక్రియ చేయవలెను”.  అప్పుడు శ్రీరాముడు రాబోయే ఖరదూషణ యుద్ధమును ఊహించి, తగిన జాగ్రత్తలు, సన్నాహములు చేసెను.

మనముకూడా శ్రీరామునివలె ఎల్లప్పుడు అప్రమత్తులమై ఉండవలెను, అని నీతి.

Advertisements