నవాగ్రయణపూజాభిరభ్యర్చ్య పితృదేవతాః । కృతాగ్రయణకాః కాలే సన్తో విగతకల్మషాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షోడశస్సర్గః (౬వ శ్లోకము)

 హేమంత ఋతు వర్ణన చేస్తూ లక్ష్మణుడిట్లు శ్రీరామునితో పల్కెను:

సత్పురుషులు నవాగ్రయణపూజ ద్వారా పితృదేవతలను తృప్తి పరచి పాపరహితులగుచున్నారు”.

క్రొత్తధాన్యం ఇంటికి వచ్చినప్పుడు, దానిని శాస్త్రోక్త పద్ధతిలో దేవపితృకార్యాలకు ప్రప్రథమముగా వినియోగించి (నవాగ్రయణాది ప్రక్రియలద్వారా), మిగిలిన ధాన్యనుము ప్రసాదముగా స్వీకరించుట సనాతన ధర్మమని శ్లోకము ద్వారా తెలుస్తున్నది. అట్లు నివేదనము చేయక తన తృప్తికై ధాన్యమును ఉపయోగించినచో, ఆ ధాన్యార్జనయందు జరిగే జీవహింసాపాపము యజమానికి అంటునని లక్ష్మణుడు మనకి బోధిస్తున్నాడు.

Advertisements