పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే । స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౭వ శ్లోకము)

పంచవటి ప్రదేశమునకు చేరిన తరువాత పుష్కళముగా సమిధలు, పుష్పములు, కుశలు, నీళ్ళు (మొదలైన పూజాసామాగ్రి) దొరికే ప్రదేశములో కుటీరము నిర్మించవలెననుకొనెను శ్రీరాముడు. కుటీర నిర్మాణమునకు అనువైన ప్రదేశమును ఎంచుమని బుద్ధిశాలియైన లక్ష్మణునికి చెప్పెను శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు ధార్మికవాక్కులను పల్కెను:

రామా! ఎన్ని వందల సంవత్సరములు గడిచిననూ (నేనెంత పేద్దవాడనైననూ) నేను నీకు అధీనుడనే. కావున నీవే స్థల నిర్ణయము చేసి, కుటీరనిర్మాణము చేయుమని నన్నాజ్ఙాపించుము”.

ఆదర్శ అన్నదమ్ములెలా ఉండాలో ఘట్టము ద్వారా తెలుస్తున్నది. చిన్నవాడైనా, సమర్థుడుకావున స్థలనిర్ణయము చేసే స్వేచ్ఛను తమ్మునికిచ్చెను శ్రీరాముడు. స్వేచ్ఛినిచ్చినా స్వతంత్రించక, అన్నగారినే నిర్ణయం తీసుకోమనెను లక్ష్మణుడు. ఇట్టి ఆదర్శ జీవనమునకు అద్దంపట్టే శ్రీమద్రామాయణము మనకు శిరోధార్యము.

Advertisements