తతః పుష్పబలిం కృత్వా శాన్తిం చ స యథావిధి । దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౨౫వ శ్లోకము)

అందమైన కుటీరమును నిర్మించిన పిమ్మట, లక్ష్మణుడు పవిత్ర గోదావర్నదిలో స్నానమాచరించి, కొన్ని పద్మములను తీసుకువచ్చెను. శాస్త్రానుసారముగా (వాస్తుపురుష) పూజ, శాంతి, చేసి నివాసయోగ్యమైన ఆ ఆశ్రమును శ్రీరామునికి చూపెనని ఈ శ్లోకార్థము.

క్రొత్త ఇంటిలో ప్రవేశించేముందు, శాస్త్రానుసారముగా గృహప్రవేశము చేయవలెను. అడవులలో ఉండవలసి వచ్చినప్పుడుకూడా ఇట్టి వైదికధర్మములను పాటించిన సీతారామలక్ష్మణులు మనకు మార్గదర్శకము కావలెను.

Advertisements