యథైషా రమతే రామ ఇహ సీతా తథా కురు । దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్ఛతీ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రయోదశస్సర్గః (౪వ శ్లోకము)

భగవంతుడైన అగస్త్యుడు శ్రీరామునితో ఇట్లనెను:

శ్రీరామా! సీతాదేవి నిన్ను అనుగమించి అడవులకు రావడమన్న దుష్కరకార్యము సాధించి స్త్రీలోకానికే తలమాణికమైనది. ఇట్టి సాధ్విని సుఖపెట్టుట నీ కర్తవ్యను. ఆమెకేది ఇష్టమో అదే చేయి”.

అనుకూలవతియైన భార్యను భర్త ఎంత ప్రేమానురాగములతో చూచుకోవాలో శ్లోకము ద్వారా అగస్త్యుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఇట్టి ఉన్నతాదర్శాలను బోధించే భారతీయతకు జేజేలు.

Advertisements