అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథీన్ ప్రతిపూజ్య చ । వానప్రస్థ్యేన ధర్మేణ స తేషాం భోజనం దదౌ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ద్వాదశస్సర్గః (౨౭వ శ్లోకము)

అగ్నిహోత్రము (నైవేద్యము, వైస్వదేవము) పూర్తిచేసుకొన్న అగస్త్యుడు అతిథులై వచ్చిన సీతారామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాదులిచ్చి, తన ఆశ్రమధర్మమైన వానప్రస్థానుసారముగా వారికి భోజనము పెట్టెనని శ్లోకార్థము.

అతిథిసత్కారక్రమమీ శ్లోకము ద్వారా బోధిస్తున్నాడు వాల్మీకిమహర్షి. ముందు దేవతా, పితృదేవతారాధనలో భాగమైన అగ్నిహోత్రములు (నైవేద్య, వైస్వదేవములు) ముగించుకొని, తరువాత నారాయణస్వరూపుడైన అతిథిని అర్ఘ్యపాద్యాదులతో పూజించాలి. తరువాత తన వర్ణాశ్రమ ధర్మాలకనుగుణముగా అతిథులకు భోజనము ఏర్పాటు చేయాలి.

Advertisements