సదృశం చానురూపం చ కులస్య తవ చాత్మనః । సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యోపి గరీయసీ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే దశమస్సర్గః (౨౨వ శ్లోకము)

తనకు హితవు చెప్పిన సీతను ప్రశంసిస్తూ శ్రీరాముడిట్లు పల్కెను:

జానకీ! నీవు నీ స్వభావమునకు, జనకునివంశమునకు, తగినట్టుగా సత్యములు పలికితివి. నీవు నాకు ప్రాణములకంటేను ప్రియమైనదానవి. నా సహధర్మచారిణివి అగునందున ధర్మాచరణములో నాతో పాలుపంచుకొనుము”.

మనము నేర్వవలసిన నీతులు:

  1. తాను ఎంతటి ధార్మికుడైననూ, శిష్యస్థానములోనున్న సీతాదేవి హితవు చెప్పినప్పుడు శ్రీరాముడు హితవును వినుటయే కాక తిరిగి ఆమెను మెచ్చుకొనెనుశ్రీరామునికి తాను ధార్మికుడను అన్న అహము మాత్రమూ లేదని ఘట్టము ద్వారా తెలుస్తున్నది. మనము కూడా మనకి తెలిసిన (ధార్మిక, ఆధ్యాత్మిక) విషయాలైనా సరే, ఎవరైనా భక్తితో చెపితే, నాకు తెలుసును అని తేల్చివేయకుండా శ్రీరాముని వలె విని దానిని పాటించే ప్రయత్నము మరింత బలపరచుకోవాలి.
  2. ఒక భర్తకు భార్యమీద ఎంత ప్రేమ ఉండాలో శ్రీరాముని వద్ద నేర్వాలి. అంతేకాక ఎల్లప్పుడూ ఆమెతో శ్రీరామునివలె అనునయముగా మాట్లాడాలి.
  3. “సహధర్మచారిణి” పదానికి ఈ శ్లోకములో సరైన నిర్వచనమిచ్చెను శ్రీరాముడు. పతియొక్క ధర్మములకు సహకరించుటే సతి యొక్క ధర్మము.
Advertisements