ఉపాస్య పశ్చిమాం సన్ధ్యాం సహభ్రాత్రా యథావిధి । ప్రవివేశాశ్రమపదం తమృషిం సోభ్యవాదయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకాదశస్సర్గః (౭౦వ శ్లోకము)

సాయంకాలసమయములో అగస్త్యభ్రాతాశ్రమము చేరిన రామలక్ష్మణులు, యథావిధిగా సంధ్యావందనము చేసిన తరువాతనే పవిత్రాశ్రమ ప్రవేశము చేసిరని శ్లోకార్థము.

మనముకూడా (ఉపనయనమైనచో) సకాలములో సన్ధ్యాది ఆహ్నికములు ముగించుకొని శుచిలమైన తరువాతనే పవిత్ర తీర్థక్షేత్రములలోకి ప్రవేశించవలెను.

Advertisements