స్వదారనిరతస్త్వం చ నిత్యమేవ నృపాత్మజ । ధర్మిష్ఠః సత్యసన్ధశ్చ పితుర్నిర్దేశకారకః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౬వ శ్లోకము)

యుక్తాయుక్తములు బాగా తెలిసిన సీతాదేవి తన పతితో ప్రేమగా ఇలా పలికినది:

నీవు ఎల్లప్పుడు నీ ధర్మపత్నినైన నన్నే కోరుకుందువు (పరస్త్రీవ్యామోహము నీకు లేదు), నీవు నిత్యసత్యవాదివి. నీవు ధర్మానికి నిలయము, తండ్రి యొక్క వచనమును సైతము నిలబెట్టిన ధార్మికుడివి”.

శ్రీరామునిలో మనము నేర్వవలిసిన శుభలక్షణములు సీతాదావి స్వయముగా మనకీశ్లోకముద్వారా బోధించుచున్నది.

Advertisements