త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నమాశ్రమమణ్డలమ్ । ఋషీణాం పుణ్యశీలానాం దణ్డకారణ్యవాసినామ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే అష్టమస్సర్గః (౬వ శ్లోకము)

సుతీక్ష్ణమహర్షికి ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి, ప్రణామముచేసి, ఆయన వద్ద సెలవుతీసుకొంటూ శ్లోకము చెప్పెను శ్రీరాముడు:

స్వామీ! మేము దండకారణ్యములోనున్న అందరు మహర్షుల పుణ్య ఆశ్రమములు దర్శించుటకై కుతూహలముతో ఉన్నాము”.

పుణ్యక్షేత్రములు, తీర్థములు, మహాత్ములను దర్శించుటకై ఎట్టి కుతూహలము ఉండవలెనో మనకి నేర్పుతున్నాడు శ్రీరాముడు. అట్లే పరమాత్మకు తన భక్తులకై పడే ఆరాటముకూడా శ్లోకముద్వారా తెలుస్తున్నది.

Advertisements