త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవన్త్యుత । మిథ్యావాక్యం పరమకం తస్మాద్గురుతరావుభౌ । పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రతా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౩వ శ్లోకము)

యుక్తాయుక్తములు బాగా తెలిసిన సీతాదేవి తన పతితో ప్రేమగా ఇలా పలికినది:

స్వామీ! లోకములో కామజములైన వ్యసనములు ముఖ్యముగా మూడు. మెదటిది, మరియు అన్నిటికన్నా ప్రమాదకరమైనది అబద్ధము. పరస్త్రీవ్యామోహము రెండవది. తనకు హానికలిగించని ప్రాణులను కూడా హింసించుట మూడవది”.

కాబట్టి మనము ఇట్టి వ్యసనములకు దూరముగానుండవలెను.

Advertisements