తచ్చ సర్వం మహాబాహో! శక్యం ధర్తుం జితేన్ద్రియైః । తవ వశ్యేన్ద్రియత్వం చ జానామి శుభదర్శన ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౮వ శ్లోకము)

యుక్తాయుక్తములు బాగా తెలిసిన సీతాదేవి తన పతితో ప్రేమగా ఇలా పలికినది:

మహావీరా! శ్రీరామా! నీవు జితేద్రియుడవని నేనెరుగుదును. సత్యపాలనము మొదలైన సమస్తశుభములకు మూలము ఇంద్రియనిగ్రహమే కదా”.

“Liberalism” అనే పేరుతో విచ్చలివిడిత్వాన్ని ప్రోత్సహించే నేటి సమాజానికి సీతాదేవి మాటలు మార్గదర్శకము కావలెను. శుభాలన్నిటికి ఇంద్రినిగ్రహమే మూలమని బోధించిన తల్లికి వేయిదండాలు!

Advertisements