నైవమర్హథ మాం వక్తుం ఆజ్ఞాప్తోహం తపస్వినామ్ ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షష్ఠస్సర్గః (౨౨వ శ్లోకము)

రాక్షసులబారినుండి కాపాడమని ప్రార్థించిన ఋషులతో శ్రీరాముడిట్లనెను:

“ఓ మహాత్ములారా! మీరు నన్ను ఇట్లు ప్రార్థించుట ఏ మాత్రమూ తగదు. నేను తాపసుల ఆజ్ఞలను పాలింపవలసినదే”.

తాను సామ్రాజ్యానికి రాజైకూడా శ్రీరాముడు ఎంతో వినయముతో వర్తించెను. ఇట్టి వినయమే మహాత్ములకు అలంకారము. ఋషుల తపస్సు, వారి ధర్మము కాపాడుట రాజు యొక్క కర్తవ్యమని శ్రీరాముని సందేశము.

Advertisements