తతః శుభం తాపసభోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యామ్ । తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సన్ధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే సప్తమస్సర్గః (౨౪వ శ్లోకము)

సీతారామలక్ష్మణులు మరియు సుతీక్ష్ణుడు సాయంకాల సంధ్యోపాసన చేసుకొనిన తరువాత, మహాత్ముడైన సుతీక్ష్ణుడు స్వయముగా ఆదరపూర్వకముగా సీతారామలక్ష్మణులకి అర్ఘ్యపాద్యాదులిచ్చి, సాత్వికాహారము సమర్పించి, సత్కరించెనని ఈ శ్లోకార్థము.

సంధ్యావందనాదనాది నిత్యకర్మల ప్రాముఖ్యత, మరియు అతిథిసత్కారము యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే ఈ శ్లోకము చిరస్మరణీయము.

Advertisements