అక్షయా నరశార్దూల! మయా లోకా జితాః శుభాః । బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చమస్సర్గః (౩౧వ శ్లోకము)

మహాతపస్సంపన్నుడు, పరమపుణ్యమూర్తి అయిన శరభంగముని శ్రీరామునితో ఇట్లనెను:

“ఓ మహాపురుషా! నా తపశ్శక్తిప్రభావమున అక్షయములైన పుణ్యలోకములు నాకు లభించినవి. ఆ తపఃఫలితాన్నంతటిని నీకు సమర్పించుచున్నాను. స్వీకరింపుము”.

‘కర్మసన్యాసము’ అను పదమునకు నిర్వచనము చెప్పిన శరభంగముని చరిత్ర మనకు మార్గదర్శకము కావలెను! ఆయన అనంతములైన పుణ్యకర్మలను చేసికూడా, వాటి ఫలితమును ఆశించలేదు. ఆ పుణ్యమును భగవదర్పణము చేసి మోక్షమును పొందెను.

Advertisements